📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Nagavali River Bridge Issue: ఇంటర్ విద్యార్థులకు నది దాటడమే ఓ పరీక్ష

Author Icon By Siva Prasad
Updated: February 23, 2026 • 11:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nagavali River Bridge Issue: నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కావడంతో పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నాగావళి నదికి తూర్పు వైపు ఉన్న 8 గ్రామ పంచాయతీల విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలంటే ప్రాణాలకు తెగించి నదిని దాటాల్సి వస్తోంది. “పరీక్ష పేపర్ కంటే నాగావళి నదిని దాటడమే మాకు అసలైన పరీక్షగా మారింది” అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: ACB Raid in Vizianagaram: లక్ష లంచం తీసుకుంటూ దొరికిపోయిన విఆర్వో

దశాబ్దాల కల.. పూర్ణపాడు-లాభేసు వంతెన

కొమరాడ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని పదుల సంఖ్యలో గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించే పూర్ణపాడు-లాభేసు వంతెన నిర్మాణం దశాబ్దాలుగా అసంపూర్తిగానే ఉంది. 2006లో ప్రారంభమైన ఈ వంతెన పనులు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ₹10 కోట్లు మంజూరు చేసి 70 శాతం పనులు పూర్తి చేయగా, తర్వాతి ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం దీనిని పట్టించుకోకపోవడంతో నేడు అది మొండిగోడలతో దర్శనమిస్తోంది.

Komarada Nagavali River: ప్రభుత్వంపై ఆశలు..

చిన్నపాటి వర్షం పడినా ఈ ప్రాంత వాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. అత్యవసర వైద్యం కావాలన్నా, గర్భిణీలను ఆసుపత్రికి తరలించాలన్నా నది దాటడం అసాధ్యంగా మారుతోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, ఆగిపోయిన వంతెన పనులను తక్షణమే పూర్తి చేసి తమ కష్టాలను కడతేర్చాలని ఎనిమిది పంచాయతీల ప్రజలు వేడుకుంటున్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AP Education Updates Inter Exams 2026 Komarada News Nagavali River Bridge Issue Parvatipuram Manyam News Purnapadu Labhesu Bridge

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.