हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Latest news: Kollu Ravindra: పేదలకు అండగా కూటమి ప్రభుత్వం

Tejaswini Y
Latest news: Kollu Ravindra: పేదలకు అండగా కూటమి ప్రభుత్వం

విజయవాడ : పేదలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) పేర్కొన్నారు. ఈ మేరకు మచిలీపట్నం టీడీపీ(TDP) కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. 26 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ.15.62 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 455 మందికి రూ.5 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందించినట్లు తెలిపారు. అదే సమయంలో పార్టీ కార్యకర్తలకు సంక్షేమ నిధి నుండి ఆర్ధిక సాయం అందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Read Also: AP: ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్‌తో దొంగ మస్టర్లకు చెక్

రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురికి పార్టీ సంక్షేమ నిధి నుండి రూ.5 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించాం. కరగ్రహారంకు చెందిన వల్లభనేని మస్తాన్, 13వ డివిజన్ రామానాయుడు పేటకు చెందిన పట్నాల సుబ్బారావు(Patnala Subbarao) కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందినట్లు తెలిపారు. కష్టంలో ఉండే ప్రతి పేద వారికి అండగా నిలిచినప్పుడే అసలైన సంతృప్తి అన్నారు. రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి రంగంలో అభ్యున్నతి పథంలో నడిపించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు పంపిణీ

ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ కాని చికిత్సలకు ప్రభుత్వం నుండి ఆర్ధిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్లు అందిస్తున్నాం. వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నాం. ఎన్నికల్లో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశాం. ఉచిత గ్యాస్, ఉచిత బస్సు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను హామీ మేరకు అమలు చేసి చూపించాం. పేదలకు సంక్షేమ పథకాలు అందించే విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. విశాఖ కేంద్రంగా రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. గూగుల్ రాకతో అదానీ, రిలయన్స్ కూడా డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి.

Kollu Ravindra
Coalition government stands by the poor

మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ నేతలు రాద్దాంతం చేయాలనుకుని బొక్కబోర్లా పడ్డారు. గత ఐదేళ్ల పాలనా కాలంలో మెడికల్ కాలేజీలు పూర్తి చేయకుండా కమిషన్లు దండుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలని నిర్ణయించాం. మెడికల్ విద్య, వైద్యంలో ఎక్కడా రాజీ పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల్ని రెచ్చగొట్టి కాలం నెట్టుకు రావాలనుకునే జగన్ రెడ్డి లాంటి అరాచక శక్తులకు బుద్ధి చెబుతామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ(BJP) ఇంఛార్జి సోడిశెట్టి బాలాజీ, మత్స్యకార కొర్పొరేషన్ డైరెక్టర్ లంకె నారాయణప్రసాద్ గారు, టౌన్ పార్టీ అధ్యక్షులు లోగిశెట్టి స్వామి గారు, క్లస్టర్ ఇంఛార్జి పల్లపాటి సుబ్రహ్మణ్యం, టౌన్ పార్టీ ఉపాధ్యక్షులు బత్తుల అనిల్, మున్సిపల్ మాజీ చైర్మన్ బాబాప్రసాద్, జనసేన ఇంఛార్జి బండి రామకృష్ణ, పిప్పళ్ల వెంకన్న, టౌన్ పార్టీ మాజీ అధ్యక్షులు ఇలియాస్ బాషా, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణికుమార్, మండలపార్టీ అధ్యక్షులు కాగిత వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870