📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Kolikapudi Srinivasa Rao : కొలికపూడిపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహం

Author Icon By Divya Vani M
Updated: March 29, 2025 • 4:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kolikapudi Srinivasa Rao : కొలికపూడిపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహం ఉమ్మడి కృష్ణాజిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటారు. ఆయన తీరు గతంలోనే హైకమాండ్ దృష్టికి వెళ్లి పలు హెచ్చరికలు వచ్చినా తన వైఖరిని మార్చుకోలేదని తాజా సంఘటనలు స్పష్టంగా చెబుతున్నాయి.కొన్నిరోజుల క్రితం మరో వివాదంలో కొలికపూడి పేరు మళ్ళీ మారుమోగింది. తిరువూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత అలవాల రమేష్ రెడ్డి పై చర్యలు తీసుకోకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఏకంగా టీడీపీ నాయకత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది.ఇదంతా చర్చనీయాంశంగా మారుతుండగానే నేడు మరింత కీలక పరిణామం చోటుచేసుకుంది.

Kolikapudi Srinivasa Rao కొలికపూడిపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహం

తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు.మాకు కొలికపూడి వద్దు అంటూ వారు బహిరంగంగా నినాదాలు చేశారు.ఈ హఠాత్పరిణామం టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తక్షణమే స్పందించి,తిరువూరు కార్యకర్తలను సముదాయించేందుకు ముందుకొచ్చారు. అక్కడే పార్టీ నేతలతో సమావేశమై, కార్యకర్తల ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. పార్టీ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని, క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టంగా తెలిపారు. అలాగే, తిరువూరు కార్యకర్తల అభిప్రాయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేశ్ దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.ఈ సంఘటనలు చూస్తుంటే, కొలికపూడి వ్యవహారం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారిందని అర్థమవుతోంది. హైకమాండ్ ఈ విషయాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

ChandrababuNaidu KolikapudiSrinivasRao NaraLokesh TDP TDPMLA ThiruvuruPolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.