हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Kodali Nani: మెరుగైన చికిత్స కోసం అమెరికాకు కొడాలి నాని?

Sharanya
Kodali Nani: మెరుగైన చికిత్స కోసం అమెరికాకు కొడాలి నాని?

కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో నాని ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే ముంబాయిలో గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. అయితే నాని మెరుగైన వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్టు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన మరింత మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలిసింది.

ఆరోగ్య సమస్యలు – చికిత్స కోసం పయనం:

కొద్ది రోజుల క్రితం కొడాలి నాని గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముంబైలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో మూడు రక్తనాళాలు పూడుకుపోయినట్టు గుర్తించటంతో, బైపాస్ సర్జరీ నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యాక, ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం అమెరికాకు వెళ్లే యోచనలో ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్న కొడాలి నాని పార్టీ ముఖ్య నేతలు మాత్రమే కలిసేందుకు అనుమతి ఇచ్చారు. ఇతరులెవరినీ కలవడం లేదని సమాచారం. ఆయన ఆరోగ్యంపై పార్టీ శ్రేణులు, అభిమానులు ఆరా తీస్తున్నారు. మరోవైపు, ఆయనపై గతంలో వచ్చిన కొన్ని ఆరోపణలు కూడా చర్చనీయాంశమయ్యాయి.

రాజకీయ కోణం:

ఆరోపణల కోణంలో చూస్తే, కొడాలి నానిపై గతంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా, కాంట్రాక్టుల విషయంలో భిన్నమైన నిర్ణయాలు, ప్రభుత్వ వ్యవస్థను అప్రతిష్టపాలు చేసే విధంగా వ్యవహరించడం, వంటి పలు ఆరోపణలు వచ్చాయి. వాటిలో కొన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దృష్టిలో ఉన్నట్టు సమాచారం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ ఆరోపణలపై విచారణల ప్రాసెస్ ప్రారంభమైంది. ఈ విచారణల నేపథ్యంలో కొడాలి నాని అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

రాజకీయాలకు తాత్కాలిక విరామం:

నాని ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాల నుంచి పూర్తిగా విరమించారు. గుడివాడ నియోజకవర్గంలో, పార్టీ సమావేశాల్లో లేకుండా ఉండటం, మీడియా వద్ద కనపడకపోవటం. పార్టీ వాళ్ళు మాత్రం ఆరోగ్య కారణాలతోనే ఈ విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నారు. నాని కోలుకున్నా కొంత కాలంగా పూర్తిగా రాజ కీయాలకు దూరంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. కాగా, నాని తిరిగి ఆరోగ్యంగా రావాలని ఆయన అభిమానులు పార్టీ కేడర్ పూజలు చేసింది. ప్రస్తుతం నాని కోలుకున్నారు. మరింత మెరుగైన చికిత్సతో పాటుగా విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నట్లు తెలుస్తోంది.

Read also: AP Liquor Scam Case : ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డికి రిమాండ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870