📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Kodali Nani: కోడాలి నాని హైదరాబాద్ లో ప్రత్యక్షం..అందరికీ షాక్

Author Icon By Sharanya
Updated: May 24, 2025 • 3:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి కోడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కోడాలి నాని ఇటీవల మరోసారి వార్తలకెక్కారు. ఇప్పటికే ఆయనపై అనేక కేసులు నమోదై ఉండగా, ఏపీ పోలీసులు దేశం విడిచి పారిపోవద్దని లుకౌట్ నోటీసులు (LOC – Look Out Circular) జారీ చేశారు.

లుకౌట్ నోటీసుల జారీ – పారిపోవాలన్న అనుమానాల మధ్య చర్య

మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కేంద్ర హోంశాఖలోని ఇమిగ్రేషన్ విభాగం ఆయనపై LOC (లుకౌట్ సర్క్యులర్) జారీ చేసింది. ఆయన వైద్యం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉండటంతో కృష్ణా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. కొడాలి నాని అక్రమాలపై విచారణ జరుగుతుండటంతో ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఈ చర్యలు తీసుకున్నారు. గుండె సమస్యతో బాధపడుతూ ముంబైలో సర్జరీ చేయించుకోగా ఆయన మెరుగైన వైద్యం కోసం అమెరికాకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరిగింది.

హైదరాబాద్‌లో ప్రత్యక్షం – అందరికీ షాక్ ఇచ్చిన కోడాలి నాని

అయితే ఇదే సమయంలో, మే 23, 2025 (శుక్రవారం) రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కోడాలి నాని ప్రత్యక్షమయ్యారు. ఆయన్ని అక్కడ చూసిన వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన, అధికారుల చర్యలపై ప్రజలలో ప్రశ్నలు తెరపైకి తీసుకొచ్చింది. లుకౌట్ నోటీసుల మధ్య ఆయన బయట ఎలా తిరుగుతున్నారు?

కోడాలి నానిపై ఉన్న కేసులు

కొడాలి నానిపై ఇప్పటికే కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రైతు మోషే కేసు, వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడారని కేసులు నమోదయ్యాయి. ఇసుక, మట్టి, భూకబ్జాలకు సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. టిడ్కో ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని.. జగనన్న కాలనీలో మెరక పేరుతో రూ.45 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. 2022లో నిబంధనలకు విరుద్ధంగా గుడివాడలో క్యాసినో నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. గుడివాడ ఆటోనగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం గోదాము ఖాళీ చేయించారని ఆయనతో పాటు అప్పటి జేసీ మాధవీలత, ఇతరులపై బాధితుడు ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై గుడివాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భీమేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాలకు చెందిన సుమారు 9 ఎకరాల భూమిని కాజేయడానికి ప్రయత్నించారని ఫిర్యాదులు వచ్చాయి. దీనికి సంబంధించిన ఫైలు కనిపించకుండా పోయిందనే ఆరోపణలు వచ్చాయి అప్పట్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదట. ఈ క్రమంలో కొడాలి నానిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.

ముంబైలో చికిత్స – ఆరోగ్య కారణాలపై మళ్లీ చర్చ

ఇప్పటికే కోడాలి నాని గత కొన్ని వారాలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ముంబైకు ప్రత్యేక విమానంలో తరలించారు. అక్కడ ఏషియన్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రముఖ కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ రమాకాంత్‌ పాండా కీలకమైన కార్డియాక్‌ సర్జరీలను చేశారు. కొడాలి నాని ముంబైలోనే కొద్దిరోజులు ఆస్పత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన కోలుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. కొద్దిరోజులు ఆసుపత్రిలో ఉండి కోలుకున్న తర్వాత, ఆయన తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సమయంలో ఆయన శరీరాకృతి చాలా సన్నగా మారడం జనాల్లో చర్చనీయాంశమైంది

https://twitter.com/manchodumani/status/1925984033269268578?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1925984033269268578%7Ctwgr%5Eb8051ce5ca329d0f9dd8ab72b45ebf5d330fa4ae%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Fandhra-pradesh%2Fnews%2Fkodali-nani-spotted-in-a-hyderabad-wedding-event-after-look-out-notice%2Farticleshow%2F121377657.cms

Read also: Vallabhaneni Vamsi: వంశీ ఆరోగ్య పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

#AndhraPradeshPolitics #Hyderabad #KodaliNani #KodaliNaniInHyderabad #PoliticalShock Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.