📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: KGH Hospital:  కేజీహెచ్‌లో అగ్ని ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న రోగులు

Author Icon By Tejaswini Y
Updated: November 29, 2025 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH Hospital)లో శనివారం ఉదయం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. గుండె వ్యాధుల విభాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆసుపత్రిలో కొన్ని క్షణాలు ఆందోళన నెలకొంది. అయితే సిబ్బంది వెంటనే స్పందించడంతో రోగులందరూ క్షేమంగా బయటపడగలిగారు.

వివరాల ప్రకారం, కార్డియాక్ విభాగానికి చెందిన ఆఫీస్ గదిలో ఉన్న ఎయిర్‌ కండిషనర్‌లో షార్ట్ సర్క్యూట్(Short circuit) చోటుచేసుకుని మంటలు రావడం జరిగింది. దాంతో గది నిండా దట్టమైన పొగ వ్యాపించి, ఆ వార్డులో ఉన్న రోగులు మరియు వారి బంధువులు భయాందోళనలకు గురయ్యారు. కొంతమంది పొగ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఎదుర్కొన్నారు.

Read Also: Kurnool Road Accident: కర్నూలులో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

Fire accident at KGH.. Patients suffocated

రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం

పరిస్థితిని గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో పాటు, ఆ వార్డులో ఉన్న 45 మంది రోగులను అత్యవసరంగా మరో బ్లాక్‌కు తరలించారు. ఈ ఘటనను కేజీహెచ్ సూపరింటెండెంట్ ధృవీకరించారు.

దుర్ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సర్వీస్(Fire Service) సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగిందని ప్రాథమిక నిర్ధారణ. సిబ్బందిచేసిన వేగవంతమైన చర్యల వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. అయితే ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు పదేపదే జరుగుతుండటం పట్ల రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AndhraPradeshNews HospitalFireIncident KGHFireAccident KingGeorgeHospital VisakhapatnamFire VisakhapatnamNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.