📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP Cabinet : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

Author Icon By Sudheer
Updated: October 11, 2025 • 7:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజధాని నిర్మాణ కార్యక్రమంలో భాగంగా రూ.212 కోట్ల వ్యయంతో రాజ్ భవన్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రాజ్ భవన్‌ను విశాఖపట్నంలో ఆధునిక సదుపాయాలతో నిర్మించనున్నట్లు సమాచారం. ప్రభుత్వాధికారులు, గవర్నర్ కార్యాలయ సిబ్బంది అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ ప్రణాళిక సిద్ధం చేయబడిందని అధికారులు వెల్లడించారు. దీతో విశాఖలో పరిపాలన విస్తరణకు మరో పెద్ద అడుగు పడినట్లైంది.

Latest News: IND vs WI: టీమిండియా భారీ స్కోర్

పల్లె పరిపాలనను బలోపేతం చేయడానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పంచాయతీ సెక్రటరీలను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా (PDOs) మార్చేందుకు మంత్రివర్గం అనుమతి తెలిపింది. ఈ నిర్ణయం గ్రామీణాభివృద్ధి రంగంలో ప్రగతికి దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, పంచాయతీల వర్గీకరణకు ఆమోదం ఇవ్వడంతో పాటు, 13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చే నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ప్రతి పంచాయతీకి స్వతంత్ర పరిపాలనా హోదా లభించనుంది. ప్రజా సేవల అందుబాటు పెరిగి, గ్రామస్థాయి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కానున్నాయి.

ఇంకా విశాఖపట్నం నగర అభివృద్ధికి పెద్ద ఊతమిచ్చేలా, రూ.87,000 కోట్లతో డేటా సెంటర్ల ఏర్పాటుకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో గూగుల్ అనుబంధ సంస్థ Raiden Infotech తోపాటు ఇతర ప్రముఖ టెక్ సంస్థలు కూడా భాగస్వామ్యం కానున్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం 480 ఎకరాల భూమిని గూగుల్ డేటా సెంటర్‌కు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడటంతో పాటు, విశాఖను ఐటీ క్యాపిటల్‌గా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యం మరింత వేగవంతం కానుంది. ఈ నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన, సాంకేతిక రంగాల్లో కొత్త దశలోకి అడుగుపెట్టినట్టైంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

AP Cabinet AP Cabinet Meeting AP Cabinet meeting decisions Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.