ఆంధ్రప్రదేశ్ సముద్ర వాణిజ్యంలో భారీ అడుగు వేసింది. తూర్పు తీరాన్ని దేశానికి ప్రధాన మారిటైమ్ గేట్‌వేగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు పడింది.ప్రపంచ ప్రఖ్యాత మాయర్స్క్ గ్రూప్ (The famous Maersk Group) లో భాగమైన ఏపీఎం టెర్మినల్స్ (APMT) సంస్థతో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ (APMB) కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ఒప్పందంతో రాష్ట్రానికి రూ.9,000 కోట్ల భారీ పెట్టుబడి రానుందని సీఎం చంద్రబాబు (Chandrababu) వెల్లడించారు. ఇది పోర్టుల అభివృద్ధిని వేగవంతం చేయనుంది.ఈ భాగస్వామ్యం ద్వారా ఆధునిక పోర్టులు, అంతర్జాతీయ టెర్మినల్స్ నిర్మించబోతున్నారు. మౌలిక వసతుల స్థాయిని గణనీయంగా మెరుగుపరిచే అవకాశం ఉంది.
పారిశ్రామిక పురోగతితో పాటు సామాజిక మార్పు
పరిమిత పెట్టుబడులకు కాకుండా, ఈ ప్రాజెక్ట్ ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి తోడుగా, గ్రామీణ ప్రాంతాలకు ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది.ఈ ఒప్పందం వల్ల సుమారు 10,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది. ఇది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్.ఏపీఎం టెర్మినల్స్‌కి ఉన్న అంతర్జాతీయ అనుభవం రాష్ట్ర వ్యూహాత్మక లొకేషన్‌కి కలిస్తే, ఇది లాజిస్టిక్స్ రంగానికి పెద్ద పురోగతిగా మారుతుంది.ఆంధ్రప్రదేశ్‌ను తూర్పు తీరానికి మారిటైమ్ గేట్‌వేగా, దేశానికి లాజిస్టిక్స్ హబ్‌గా మార్చడమే లక్ష్యం, అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
పోర్టుల ఆధునికీకరణకు ఈ ఒప్పందం కీలకం
పోర్టుల ప్లానింగ్, టెర్మినల్ ఆపరేషన్లలో ఏపీఎం టెర్మినల్స్‌కి అనుభవం అపారమని ప్రభుత్వం నమ్మకంగా ఉంది. దీనివల్ల సముద్ర వాణిజ్య రంగం బలోపేతమవుతుంది.ఈ ఒప్పందం ఏపీ భవిష్యత్తుకు గేమ్‌చేంజర్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వ్యాపారవేత్తలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ వివరాలు స్వయంగా సీఎం చంద్రబాబు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇది ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనంగా నిలిచింది.ఈ భాగస్వామ్యం ద్వారా ఏపీ పోర్ట్ వ్యవస్థకు నూతన దిశ ఏర్పడనుంది. భారత తూర్పు తీరానికి ఇది ప్రధాన ద్వారంగా మారనుంది.
Read Also :