📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య

Kethireddy: యుద్ధం ముగిసిందని తెలియదు: మాజీ ఎమ్మెల్యే

Author Icon By Saritha
Updated: January 3, 2026 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆపరేషన్ సిందూర్ అంశంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. (Kethireddy) ఎవరికీ తెలియకుండానే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందని ఆయన ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్‌లో ట్వీట్ చేసే వరకు యుద్ధం కొనసాగుతోందనే భావన ప్రజల్లో ఉందని అన్నారు. ఇక ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఆపరేషన్ సిందూర్ 2.0’ అంటూ పోస్టులు పెట్టడం ఆశ్చర్యం కలిగించిందని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. అసలు ఆపరేషన్ ఎందుకు ఆగిందో, దానికి కారణాలేంటో ప్రజలకు ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. అలాగే ఢిల్లీ పేలుడు కేసు విషయంలోనూ ఇప్పటివరకు ఏం జరిగిందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు.

Read also: Medak Crime: ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..

కేసులు కొట్టేయించుకునే పనిలో చంద్రబాబు ఉన్నారని విమర్శ

దేశ ఆర్థిక పరిస్థితులపై కూడా కేతిరెడ్డి (Kethireddy) ఆందోళన వ్యక్తం చేశారు. రోజురోజుకీ రూపాయి విలువ పడిపోతోందన్నారు. ఇలాంటి పరిస్థితి మరో ఐదేళ్లు కొనసాగితే దేశ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని హెచ్చరించారు. అయినా మనం ఏమీ పట్టించుకోకుండా మౌనంగా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడిన కేతిరెడ్డి… సీఎం చంద్రబాబు (CM Chandrababu) తనపై నమోదైన కేసులను కొట్టివేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. ఇకపై పార్టీ విషయాలపై మాత్రమే కాకుండా, సమాజంలో జరుగుతున్న పరిణామాలు, సామాజిక పరిస్థితులపై తరచుగా వీడియోల ద్వారా మాట్లాడతానని కేతిరెడ్డి స్పష్టం చేశారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Chandrababu Chief Minister Former YSRCP MLA Kethireddy venkatarami reddy Latest News in Telugu Telugu News YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.