📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Keshineni Chinni: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంటార్‌గా మిథాలీ రాజ్

Author Icon By Anusha
Updated: January 7, 2026 • 3:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏసీఏ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్‌ను ఆయన నిన్న అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా, మాట్లాడిన ఆయన,ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను ఏడాది కాలంలో గణనీయంగా అభివృద్ధి చేశామని ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) (Keshineni Chinni) స్పష్టం చేశారు. విశాఖపట్నం స్టేడియాన్ని పూర్తిగా పునరుద్ధరించామని, ఏ గ్రౌండ్‌తో పాటు బీ గ్రౌండ్‌లో కూడా రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశాఖ స్టేడియంలో కుర్చీలను మారుస్తున్నామని చెప్పారు.

Read Also: AP: రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: మంత్రి సవిత

మరో కీలక అడుగు

అలాగే, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను ఏసీఏ ఉమెన్ టీమ్ మెంటార్‌గా నియమించబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ సెక్రటరీ సానా సతీశ్‌తో పాటు అసోసియేషన్‌కు చెందిన పలువురు అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర క్రికెట్ అభివృద్ధికి ఇది మరో కీలక అడుగుగా భావిస్తున్నారు. ఏసీఏ చరిత్రలో ఈ ఏడాది జరిగినన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన (Keshineni Chinni) అన్నారు.

ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు కూడా విజయవంతంగా నిర్వహించామని, మహిళా క్రికెటర్ల పేర్లతో రెండు గేట్‌లకు నామకరణం చేశామని వెల్లడించారు. త్వరలో మహిళా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మంగళగిరి స్టేడియాన్ని స్పోర్ట్స్ సెంటర్‌గా అభివృద్ధి చేయనున్నామని, బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ తరహాలో మూలపాడును అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.

కడప స్టేడియంలో మౌలిక వసతులు మెరుగుపరచి కొత్త రూమ్స్ నిర్మించనున్నామని వెల్లడించారు.గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడానికి ‘రూరల్ టాలెంట్ సెర్చ్’ కార్యక్రమం ద్వారా కోచింగ్ క్యాంప్‌లు నిర్వహిస్తామని, ఆంధ్ర టీమ్‌కు విదేశీ కోచ్‌ను నియమించబోతున్నామని తెలిపారు. ప్రపంచ కప్ సమయంలో మహిళా క్రికెటర్లను మంత్రి నారా లోకేశ్ ప్రోత్సహించారని, అదే టీమ్ ప్రపంచ కప్ గెలవడం ఆనందంగా ఉందని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ACA Administration Office Andhra Cricket Association Kesineni Sivanath Chinni latest news Mithali Raj Telugu News Visakhapatnam Stadium

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.