📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Kashmir : కాశ్మీర్ ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి

Author Icon By Digital
Updated: April 24, 2025 • 1:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విహారయాత్రలో విషాదం: కాశ్మీర్ ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి

జమ్మూ కాశ్మీర్‌ లో సుందర ప్రదేశాలను సందర్శించేందుకు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన విశాఖపట్నానికి చెందిన జరజాపు చంద్రమౌళి (69), ఉగ్ర మూకల దాడిలో హతమయ్యారు. ఈ విషాద సంఘటన వారి కుటుంబాన్ని కన్నీటి పర్యంతం చేసింది. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసిన చంద్రమౌళి, మరో రెండు కుటుంబాలతో కలిసి ఈ నెల 16న కాశ్మీర్‌ టూర్కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ నెల 25న తిరిగి రావాల్సి ఉండగా, అంతకుముందే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.వహల్లా సమీపంలో టూరిస్టులంతా ఒకే చోట సేదతీరుతూ ఉన్న సమయంలో ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు వారిని చుట్టుముట్టారు. చంద్రమౌళి సహా మరికొంతమందిని గుర్తించి, విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. చంద్రమౌళి తనను వదిలేయమని వేడుకున్నా ఉగ్ర మూకలు కనికరించలేదు. “మీ ప్రధాని మోడీకి చెప్పుకో” అంటూ ఆయనపై కాల్పులు జరిపారు. ఘటన అనంతరం చంద్రమౌళి మిస్సింగ్ అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందగా, మరుసటి రోజు అతను మృతి చెందినట్లు సమాచారం అందింది. ఈ ఘటనలో చంద్రమౌళితో కలిసి వెళ్లిన మిగతా కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Kashmir : కాశ్మీర్ ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి


ఉగ్రవాదుల దాడిలో చంద్రమౌళి మృతి: పర్యాటక భద్రతపై ప్రశ్నలు

మృతదేహాన్ని బుధవారం రాత్రి విశాఖకు తరలించారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఎంకేజ్ అపార్ట్‌మెంట్స్ వైస్ ప్రెసిడెంట్‌గా సేవలు అందించిన చంద్రమౌళి మృతిచెందిన విషయం అందరిని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ సంఘటనతో పర్యాటకుల భద్రతపై పలు ప్రశ్నలు వెలువడుతున్నాయి. ఉగ్రదాడులు దేశ భద్రతకు ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి తేటతెల్లం చేసింది.వారి కుటుంబానికి ప్రభుత్వ స్థాయిలో సానుభూతి మరియు ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం వ్యక్తమవుతోంది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కాశ్మీర్‌ లో భద్రతను మరింత కట్టుదిట్టంగా నిర్వహించాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు.

Read more : Terror Attack : పాక్‌పై భారత్ ప్రతీకారం.. సింధూ జలాల ఒప్పందం రద్దు.. అటారీ-వాఘ సరిహద్దును మూసివేత

Breaking News in Telugu Chandramouli Death Google News in Telugu Indian Security Jammu Kashmir Violence Kashmir Attack Kashmir Tour Latest News in Telugu Paper Telugu News Telugu News Paper Telugu News Today Terrorist attack Today news Tourist Safety Visakhapatnam News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.