📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kanipakam: కాణిపాకంలో వైభవంగా సంకటహర గణపతివ్రతం

Author Icon By Sharanya
Updated: July 15, 2025 • 11:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాణిపాకం: కాణిపాకం (Kanipakam) శ్రీవరసిద్ధి వినాయకస్వామి (Srivarasiddhi Vinayaka Swamy) దేవస్థానంలో సోమవారం సంకటహర గణపతివ్రతంను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయంలో ప్రతినెలా పౌర్ణమి అనంతరం చతుర్థి రోజున ఈవ్రతంను నిర్వహిస్తుంటారు. ఈమేరకు దేవస్థానం ఆస్థాన మండపంలో అర్చకులు ఈ వ్రతాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ప్రధాన ఆలయం నుండి అలంకరించిన సిద్ధి బుద్ధి సమేత గణనాధుని ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ స్థానిక ఆస్థాన మండపంకు తీసుకువచ్చి వుంచి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ అర్చకులు వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు సంకష్ట చతుర్థి వ్రతం (Sankashta Chaturthi Vrat) మహాత్యాన్ని గురి ంచి వివరించారు. ఈవ్రతంను ఆచరించడం వల్ల భక్తులకు ఈతిబాధలు, కష్టాలు తొలగి అనుకున్న కోరికలు నెరవేరి అంతా శుభం కలుగుతుందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయని వేదపండితులు పేర్కొన్నారు. వ్రతంలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం తరపున తీర్థప్రసాదములను అందజేశారు. పవిత్రమైన సంకటహర చతుర్థి వ్రతం నిర్వహించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలిరావడంతో ఆస్థాన మండపం కిక్కిరిసింది. ఆలయ అధికారులు, ఆస్థాన మండపంలో భక్తులు సకాలంలో వ్రతాన్ని నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు, సూపరెండెంట్లు కోదండపాణి, వాసు, ఆలయ అర్చకులు వేదపండితులు, టెంపుల్ ఇన్పెక్టర్లు బాలాజినాయుడు, చిట్టిబాబు, అర్చకులు, వేదపండితులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు .

కాణిపాకం సంకటహర గణపతి వ్రతం అంటే ఏమిటి?

శ్రీ కాణిపాకం సంకటహర గణపతి వ్రతం నిత్య సేవ . గణేశ పురాణంలో చెప్పినట్లుగా, సంకటహర గణపతి వ్రతం శ్రీ కృష్ణ భగవానుడు మరియు బ్రహ్మ దేవుడు ఆచరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: TTD: టిటిడిలో మరో అన్యమత అధికారి గుర్తింపు

Breaking News Ganesh vratam Kanipakam celebrations Kanipakam Ganesh Kanipakam Temple latest news Sankatahara Ganapathi Vratam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.