ఈరోజు ప్రభుత్వ ఉన్నతాధికారులు, (Kandula Durgesh) సినీ ప్రముఖులతో ఆంధ్రప్రదేశ్,(AP) సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, సినిమా విడుదల అయ్యేటప్పుడు అప్పటికప్పుడు టికెట్ ధరలు పెంచుకోకుండా, ఒక సమగ్ర విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు.ఇటు సినీ పరిశ్రమకు, అటు ప్రేక్షకులకు న్యాయం జరిగేలా టికెట్ రేట్లు ఉండేలా చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు.
Read also: Consumer Laws : వినియోగదారుల చట్టాల పట్ల అవగాహన అనివార్యం!
సినిమా టికెట్ల ధరలపై నియంత్రణకు చర్యలు
సినిమా విడుదలైన ప్రతిసారి రేట్లు పెంచడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని దుర్గేశ్ తెలిపారు. (Kandula Durgesh) ప్రతిసారి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఒకే జీవో ఉండేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్ పై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: