📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Kandula Durgesh: పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

Author Icon By Anusha
Updated: July 16, 2025 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టూరిజం మంత్రి కందుల దుర్గేష్

విజయవాడ : రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని, విస్తృత ప్రచారం కల్పించి మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు సూచించారు. వెలగపూడి సెక్రటేరియట్ రెండవ బ్లాక్ లోని తన పేషిలో ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత పర్యాటక ప్రాజెక్టుల స్థితిగతులు, కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్ (DPR) ల తయారీ, క్యారవాన్, హోమ్ స్టే పాలసీ విధివిధానాలు, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులు, రీజినల్ సమ్మిట్ లు, శాఖాపరమైన సమావేశాలు, ఇటీవల కుదుర్చుకున్న ఎంవోయూలు, క్షేత్రస్థాయి పర్యటనల షెడ్యూల్ తదితర అంశాలపై మంత్రి దుర్గేష్ అధికారులతో చర్చించారు.

ప్రచారం కల్పించాల్సిన

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) మాట్లాడుతూ ఏపీలో 25 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులు, 50వేల గదుల ఏర్పాటు లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరాన్ని అధికారులకు వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కలకత్తా, ముంబయిలలో రోడ్ షోలు ఏర్పాటు చేసి రాష్ట్ర పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించాలని ఆదేశించారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా 22 దేవాలయాల్లో టెంట్ సిటీలతో పాటు ఇగ్లూ తరహా ఇళ్ల విషయం ఆలోచించాలన్నారు.

బీచ్ పరిశుభ్రత

అనంతరం విశాఖపట్నంలోని రుషికొండ బ్లూఫ్లాగ్ బీచ్ సుందరీకరణ అంశంపై చర్చించారు. పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాణాలకు అనుగుణంగా పర్యాటకుల భద్రత, బీచ్ పరిశుభ్రత విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలను తొలగించి పర్యాటకులకు అవసరమైన మోలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. లేపాక్షి, లంబసింగి (Lambasingi) పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన సరైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి దుర్గేష్ అధికారులను ఆదేశించారు.

కందుల దుర్గేష్ ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు?

ఆయన 2024లో మాచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కందుల దుర్గేష్ జన్మస్థలం ఎక్కడ?

ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందినవారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Nara Lokesh: అత్యున్నత ప్రమాణాలతో పారదర్శకంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

Andhra Pradesh Tourism AP Tourism Projects Breaking News Cinematography Minister Cultural Affairs latest news minister kandula durgesh Tourism Development Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.