📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

News telugu: Vijayawada:కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..16 మంది సభ్యులను నియామకం

Author Icon By Sharanya
Updated: September 26, 2025 • 10:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ(Vijayawada)లోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రమైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి (కనకదుర్గ ఆలయం) నూతన పాలకమండలిని నియమిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవల లక్ష్యంతో ఈ కమిటీ నియామకం జరిగిందని సమాచారం.

మొత్తం 16 మందితో పాలకమండలి

కొత్తగా నియమిత పాలకమండలిలో మొత్తం 16 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన, భాజపా నాయకులకు ప్రాతినిధ్యం దక్కింది. ఇటీవలే ఆలయ ఛైర్మన్‌గా నియమితుడైన బొర్రా రాధాకృష్ణ (Borra Radhakrishna)ఆధ్వర్యంలో ఈ సభ్యులు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

నియమితులైన పాలకమండలి సభ్యుల వివరాలు

  1. అవ్వారు శ్రీనివాసరావు – విజయవాడ వెస్ట్ (బీజేపీ)
  2. బడేటి ధర్మారావు – విజయవాడ సెంట్రల్ (టీడీపీ)
  3. గూడపాటి వెంకట సరోజినీ దేవి – మైలవరం (టీడీపీ)
  4. జీవీ నాగేశ్వరరావు – రేపల్లె (టీడీపీ)
  5. హరికృష్ణ – హైదరాబాద్ (టీడీపీ తెలంగాణ)
  6. జింకా లక్ష్మీ దేవి – తాడిపత్రి (టీడీపీ)
  7. మన్నె కళావతి – నందిగామ (టీడీపీ)
  8. మోరు శ్రావణి – దెందులూరు (టీడీపీ)
  9. పద్మావతి ఠాకూర్ – విజయవాడ వెస్ట్ (జనసేన)
  10. పనబాక భూలక్ష్మి – నెల్లూరు రూరల్ (టీడీపీ)
  11. పెనుమత్స రాఘవ రాజు – విజయవాడ సెంట్రల్ (బీజేపీ)
  12. ఏలేశ్వరపు సుబ్రహ్మణ్య కుమార్ – విజయవాడ ఈస్ట్
  13. సుకాశి సరిత – విజయవాడ వెస్ట్ (టీడీపీ)
  14. తంబాళపల్లి రమాదేవి – నందిగామ (జనసేన)
  15. తోటకూర వెంకట రమణా రావు – తెనాలి (జనసేన)
  16. అన్నవరపు వెంకట శివ పార్వతి – పెనమలూరు (టీడీపీ)

ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులు

  1. మార్తి రమా బ్రహ్మం – విజయవాడ ఈస్ట్
  2. వెలగపూడి శంకర్ బాబు – పెనమలూరు (టీడీపీ)

Read hindi news: hindi.vaartha.com

Read Also:

AP Government Breaking News Kanaka Durga Temple latest news Palkamandali Members Telugu News Temple Trust Board Vijayawada news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.