కళ్యాణదుర్గం(Kalyandurgam Election) పురపాలక సంఘం నూతన చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ మధ్య తెలుగుదేశం పార్టీ చైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి 11 మంది కౌన్సిలర్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 13 మంది కౌన్సిలర్లు ఉండగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎమ్మెల్యే ఎంపీల ఎక్స్ ఆఫీషియో ఓట్లు ఉండటంతో ఓట్ల బలం సమానంగా ఉంది. ఈ ఉత్కంఠ నేపథ్యంలో ఇద్దరు వైసిపి కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో తెలుగుదేశం పార్టీకి విజయం కలిసొచ్చింది. తెలుగుదేశం పార్టీ తరఫున 15వ వార్డు సభ్యురాలు తలారి గౌతమి, వైసీపీ తరఫున వాల్మీకి లక్ష్మన్న పోటీపడ్డారు.
Read Also: Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి
ఎక్స్ అఫిషియో ఓట్లతో టిడిపి పైచేయి
రెండువైపులా 11మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ టిడిపి(Telugu Desam Party)కి ఉన్న రెండు ఎక్స్ అఫిషియో ఓట్లతో టిడిపి అభ్యర్థి తలారి గౌతమి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఆర్డిఓ వసంత బాబు ప్రకటించి ధ్రువపత్రాన్ని అందజేశారు. ఉత్కంఠ సాగిన చైర్మన్ ఎన్నిక అనంతరం ఎమ్మెల్యే సురేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధిని ఆకాంక్షించే కౌన్సిలర్లు తమ పార్టీకి మద్దతు తెలిపారని, కళ్యాణదుర్గం పట్టణాన్ని నూతన పాలకవర్గంతో కలసి ప్రజల ఆశీర్వాదంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
అభివృద్ధి అజెండాతో టిడిపి భారీ విజయం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అంబికా లక్ష్మనారాయణ మాట్లాడుతూ అభివృద్ధి అజెండాతో కళ్యాణదుర్గం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎమ్మెల్యే సురేంద్రబాబు నాయకత్వంలో కళ్యాణదుర్గం ప్రాంతం సమగ్ర అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఆయన కళ్యాణ్ దుర్గం(Kalyandurgam Election) నియోజకవర్గంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి లక్ష్మీదేవి రమేష్, మున్సిపల్ చైర్మన్గా గౌతమి సోమశేఖర్ పాలనలో ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.
అనంతరం కార్యకర్తల నినాదాలతో ప్రత్యేక ప్రచార రథంపై పట్టణ పురవీధులలో ప్రదర్శన నిర్వహించి తమ వెంట నడిచిన ప్రజలకు కార్యకర్తలకు అభివాదం చేశారు. మార్గమధ్యంలో టిడిపి వ్యవస్థాపక అధినేత ఎన్టీ రామారావు కు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కు, జాతిపిత మహాత్మా గాంధీ, రామాయణ రచయిత వాల్మీకి మహర్షి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రజా వేదికకు చేరుకోగా అక్కడ ఉత్కంఠాపూర్లో విజయం సాధించిన ఎమ్మెల్యే సురేంద్రబాబుకు ఎంపీ అంబికా లక్ష్మినారాయణ నూతన పురపాలక సంఘం చైర్మన్ తలారి గౌతమి లను కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: