📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Mahanati Savitri: మహా నటి సావిత్రి పేరిట కళ్యాణ మండపం

Author Icon By Anusha
Updated: December 7, 2025 • 10:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగువారికి మహానటి అనగానే గుర్తొచ్చే పేరు సావిత్రి (Mahanati Savitri). చక్కటి అభినయంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఆమె నిజ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసారు. తెలుగు, తమిళ భాషల్లో 84 చిత్రాల్లో నటించిన ఆమె సింగిల్ టేక్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. నటనతో, మానవత్వంతో ఎందరికో స్పూర్తి నింపింది సావిత్రి.

Read Also: Venkaiah Naidu: మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకల్లో పాల్గొన్న వెంకయ్యనాయుడు

డిసెంబర్ 6, శనివారం మహానటి సావిత్రి (Mahanati Savitri) 90వ జయంతి. ఈక్రమంలో సావిత్ర జ్ఞాపకార్థం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె స్వగ్రామంలో రూ.2 కోట్లతో కళ్యాణ మండపాన్ని నిర్మించనున్నారు. మచిలీపట్నం (Machilipatnam) పార్లమెంటు సభ్యుడు బాలశౌరి ఈ ప్రకటన చేశారు.మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా శనివారం ఎంపీ బాలశౌరి ఆమెకు నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘సావిత్రి తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. ఆమె తన కళా ప్రతిభతో ఎందరో మహిళలకు, సినీ పరిశ్రమలోకి రావాలని భావించే వారికి స్ఫూర్తిగా నిలిచారు. సహజసిద్ధమైన ఆమె నటన.. భావ ప్రకటన, హావ- భావాల్లో అపూర్వమైన నైపుణ్యం.. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి జీవించగల నటన ఆమెకే సొంతం.

Kalyana Mandapam named after the great actress Savitri

రూ.2 కోట్లతో కల్యాణ మండపం

అందుకే నేటికీ కూడా దర్శకులు, ప్రేక్షకులు ఆమెను నటసరస్వతిగా గుర్తు చేసుకుంటూ గౌరవిస్తున్నారు’ అని తెలిపారు.‘నేను 2004-2009 మధ్య తెనాలి ఎంపీగా ఉన్నప్పుడు.. అంతటి మహానటి జ్ఞాపకార్థంగా ఆమె జన్మించిన చిర్రావూరులో ఏదైనా నిర్మాణం చేప్టటాలని నిర్ణయించుకున్నాను. ఇన్నాళ్లకు అందుకు అవకాశం లభించింది.

మహానటి సావిత్రి.. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలంలోని చిర్రావూరులో జన్మించారు. ఆమె జ్ఞాపకార్థం.. చిర్రావూరులో రూ.2 కోట్లతో కల్యాణ మండపం నిర్మిస్తాము. ఎన్‌టీపీ వారి సీఎస్‌ఆర్‌ నిధులతో భవిష్యత్తు తరాలకు గుర్తుండిపోయేలా మహానటి సావిత్రి పేరుతో కల్యాణ మండపం నిర్మిస్తాం. ఇదే ఆమెకు మనం అర్పించే ఘనమైన నివాళి’ అన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

90th birth anniversary latest news Machilipatnam Mahanati Savitri MP Balashouri Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.