అనంతపురం: తుంగభద్ర ప్రాజెక్టు నుండి ఈ నెల 17న తుంగభద్ర ఎగువ కాలువకు నీటిని విడుదల చేసేలా తుంగభద్ర (Tungabhadra) బోర్డుకు ఇండెంట్ పెట్టాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు (Kalva Srinivasulu) అధికారులను ఆదేశించారు. హెచ్ఎల్సి లోకలైజేషన్ ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సోమవారం నీటి విడుదల అంశాల అనంతపురంలోని తన స్వగృహంలో సమీక్షించారు. ముఖ్యంగా 35 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన కాలువ మరమ్మతు పనులు, గురించి క్షుణ్ణంగా చర్చించారు. మొదట్లో 500 క్యూసెక్కులతో ప్రారంభించి క్రమంగా పెంచుతూ వెళ్లాలన్నారు. ఆంధ్రా సరిహద్దుకు 18న తేదీ చేరుతాయని, ఈలోగా నీటి ప్రవాహానికి అంతరాయం లేకుండా కాలువను సంసిద్ధం చేయాలన్నారు.
మరమ్మతు పనులకు రూ.35కోట్లు
కూటమి ప్రభుత్వం (kutami government) ఎటువంటి మంజూరు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అత్యవసర మరమ్మతు పనులకు రూ.35కోట్లు చేయించామన్నారు. కాలువ బలహీనగా ఉన్న ప్రాంతాల్లో బెడ్, సైడ్ లైనింగ్, శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిలు, అండర్ టర్నల్ ప్రాంతాల్లో కొత్త స్ట్రక్చర్స్ పనులు యుద్ధ ప్రతిపాదికన చేపట్టడం జరిగిందన్నారు. ఆయకట్టు సాగుకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, రేయింబవళ్లు కష్టపడి సకాలంలో అన్ని పనులు పూర్తి చేయించారన్నారు. పరివాహక ప్రాంతంలో ప్రస్తుత ఏడాది వర్షాలు ముందే వర్షాలు కురవడంతో తుంగభద్ర ప్రాజెక్టు త్వరగా నిండిందన్నారు. సాధారణంగా గత పదేళ్లలో జూలై నాల్గవ వారం, ఆ తరువాత నీటిని తీసుకోగా ప్రస్తుత ఏడాది వారం రోజుల ముందే తీసుకునే వెసులుబాటు లభించిందన్నారు. ఈనెల 17న ప్రాజెక్ట్ వద్ద ఆంధ్రా వాటా నీటిని విడుదల చేస్తే 18న ఆంధ్రా సరిహద్దుకు వస్తాయని తెలిపారు. ఈలోగా అడ్డంగా ఉన్న మట్టి కుప్పలు, ఇతరత్ర అవాంతరాలన్నింటినీ పూర్తిగా తొలగించి శుభ్రం చేయాలన్నారు. నీటి పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కాలవ ఆదేశించారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Medical Colleges: పదోన్నతికి నిబంధనల మినహాయింపు..