Kalichetti Appalanaidu : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి తప్పదన్న అప్పలనాయుడు , ఐదేళ్లలో జగన్ చేయలేదని 16 నెలల్లో చంద్రబాబు చేశారని వ్యాఖ్య , చంద్రబాబుపై వైసీపీ, బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపాటు
ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదని విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు జోస్యం చెప్పారు. వార్డ్ మెంబర్ నుంచి కార్పొరేషన్ స్థాయి వరకు కూటమి అభ్యర్థులే ఘన విజయం సాధిస్తారని, వైసీపీని చిత్తుగా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Read also: Gudimalkapur: తెలంగాణలో నకిలీ నోట్లు స్వాధీనం .. ముగ్గురు అరెస్టు
జగన్ ఐదేళ్ల పాలనలో చేయలేని అభివృద్ధిని (Kalichetti Appalanaidu) ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం 16 నెలల్లోనే చేసి చూపించారని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు చంద్రబాబుకు రెండు కళ్లు లాంటివని, తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ ఉందని తెలిపారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాలా? వద్దా? అనే విషయంపై పార్టీ అధిష్ఠానం తగిన నిర్ణయం తీసుకుంటుందని అప్పలనాయుడు చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: