Kakinada fire accident: కాకినాడ పేలుడు ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి

Read Time:  1 min
Kakinada fire accident: కాకినాడ పేలుడు ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
Kakinada fire accident: కాకినాడ పేలుడు ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
FONT SIZE
GET APP

Kakinada fire accident: కాకినాడ జిల్లాలో శనివారం మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం – జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం సంభవించింది.ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది కార్మికులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాద సమయంలో 20 మంది వరకూ బాణాసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: Kakinada Fire Accident: బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది సజీవదహనం!

ఈ ఘటనపై మాజీ CM వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ భారీ పేలుడు విషాదకరమని, పలువురు కార్మికులు మృతి చెందడం తనను కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

భీకర విస్ఫోటనం: 5 కిలోమీటర్ల మేర వినిపించిన శబ్దం

ప్రమాద తీవ్రత ఊహించని స్థాయిలో ఉంది. పేలుడు ధాటి ఎంత భయానకంగా ఉందంటే.. అక్కడ పనిచేస్తున్న కార్మికుల మృతదేహాలు తునాతునకలై గాల్లోకి ఎగిరి, పక్కనే ఉన్న పొలాల్లో పడ్డాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలు చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినిపించిందని, దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయని స్థానికులు తెలిపారు. ఈ పేలుడు తీవ్రతకు పక్క గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాల స్లాబ్ కూడా పగుళ్లు ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

Kakinada fire accident: YS Jagan shocked over Kakinada explosion incident
Kakinada fire accident: YS Jagan shocked over Kakinada explosion incident

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన మరో 8 మందిని అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు, ఇతర అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాణసంచా తయారీలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.