Kakinada: లండన్‌లో (UK) అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు మృతి కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం కొండయ్యపేటకు చెందిన అభిషేక్ (28) ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం లండన్ వెళ్లాడు. అక్కడ ఎంబీఏ (MBA) పూర్తి చేసిన అనంతరం, అక్కడే ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం సంపాదించి స్థిరపడ్డాడు. చేతికి అందిన కొడుకు విదేశాల్లో మంచి ఉద్యోగం చేస్తూ తమను ఆదుకుంటాడని భావించిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.
Read Also: Pulivendula: నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు
ప్రాణాలు కోల్పోయిన అభిషేక్
లండన్‌లో జరిగిన ఒక భారీ అగ్నిప్రమాదంలో అభిషేక్ చిక్కుకుపోయినట్లు ఈ ప్రమాదంలో అతను ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అయితే, ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒక్కగానొక్క కొడుకు మరణ వార్త విన్న పెద్దాపురంలోని అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: