ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో కల్తీ వంట నూనె తయారీకి సంబంధించిన భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. జంతువుల కొవ్వును కరిగించి, క్రూడ్ ఆయిల్‌తో కలిపి వంట నూనె తయారు చేస్తున్న అక్రమ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ నూనెను వినియోగిస్తే తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ కొందరు లాభాల కోసం ఈ దందా కొనసాగించినట్టు వెల్లడైంది.
Read also: TTD: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనం 8 గంటలు
Adulterated ghee… the police exposed the racket
ధర్మవరం సమీపంలో పోలీసుల దాడులు
ప్రత్తిపాడు పోలీసుల సమాచారం మేరకు, ధర్మవరం సమీపంలోని ఒక రేకుల షెడ్డులో గత నాలుగు నెలలుగా ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది. ప్రతాప్‌సింగ్‌కు చెందిన షెడ్డులో జంతువుల కొవ్వును మరిగించి నూనెగా మార్చుతున్నారు. పిఠాపురం మండలం ఎఫ్‌కే పాలేనికి చెందిన బండారు ఫణిప్రసాద్ ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతడితో పాటు మరో ఎనిమిది మంది కలిసి ఈ కల్తీ నూనె తయారీ చేస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు.
రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేసిన నిందితులు
తయారు చేసిన కల్తీ వంట నూనెను డబ్బాల్లో నింపి శ్రీకాకుళం (srikakulam) జిల్లా ఇచ్చాపురం, రాజమహేంద్రవరం ప్రాంతాలకు సరఫరా చేసినట్టు దర్యాప్తులో తేలింది. మొదట ఎఫ్‌కే పాలెంలో ప్రారంభమైన ఈ వ్యాపారం, అనుకూల పరిస్థితులు లేక ధర్మవరానికి మార్చారు. తాటిపర్తికి చెందిన ఇద్దరిని పనికి పెట్టుకుని నూనె తయారీ కొనసాగించారు. జంతు కొవ్వును చెందుర్తి ప్రాంతానికి చెందిన వ్యక్తుల నుంచి, క్రూడ్ ఆయిల్‌ను కాకినాడ లైట్‌హౌస్ ప్రాంతం నుంచి కొనుగోలు చేశారు.
840 కిలోల కల్తీ నూనె స్వాధీనం..
పోలీసులు మొత్తం 56 డబ్బాల్లో నిల్వ చేసిన 840 కిలోల కల్తీ వంట నూనెతో పాటు, 60 కిలోల క్రూడ్ ఆయిల్, గ్యాస్ సిలిండర్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఫణిప్రసాద్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. కల్తీ నూనె వల్ల గుండె, కాలేయం, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు వంట నూనె కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: