కాకినాడ(Kakinada) జిల్లా సార్లంక గ్రామంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మంత్రులు, ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి పండుగ వేళ జరిగిన ఈ ప్రమాదం గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని సీఎం పేర్కొన్నారు.
Read Also: Budget 2026: మధ్యతరగతికి మరిన్ని ఊరటలు ఉంటాయా?
ఈ అగ్నిప్రమాదంలో గ్రామంలోని 38 తాటాకు ఇళ్లు పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో బాధిత కుటుంబాలకు ఎలాంటి లోటు లేకుండా సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. సహాయక చర్యల పురోగతిని హోంమంత్రి అనిత ముఖ్యమంత్రికి వివరించారు.
ప్రభుత్వం తరఫున బాధితులకు తక్షణమే నివాస ఏర్పాట్లు చేయడంతో పాటు, నష్టపరిహారం వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత శాఖలను అప్రమత్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: