రూ. 1042 కోట్లతో నిర్మాణం
Rajampet: సముద్ర ప్రాంతానికి, బీచ్లకు ప్రసిద్ధి చెందిన కాకినాడ (Kakinada) తీర ప్రాంతంలో మరో జాతీయ రహదారికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత మాల పరియోజన ప్రాజెక్టు ఫేజ్ 1 కింద 1042 కోట్ల అంచనా వ్యయంతో జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ టెండర్లు పిలిచింది. వాకలపూడి కాకినాడ (Kakinada) లైట్ హౌస్ నుంచి అన్నవరం (Annavaram) వరకు 40.621 కిలోమీటర్ల దూరం నాలుగు వరుసల రహదారిని నిర్మించనున్నారు. పిఠాపురం కత్తిపూడి మీదుగా ప్రస్తుతం రహదారి నిర్మాణం ఉంది. కొత్త రహదారి రెండు బీచ్లు దాటుకుంటూ ఓ రైల్వే వంతెన కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించనున్నారు. జూన్ 27 నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 18న ఈ టెండర్ల బిడ్లు ఓపెన్ చేస్తారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పర్యాటకులకు వరంగా మారనుంది. సముద్రతీర ప్రాంతాన్ని ఆహ్లాదంగా చూస్తూ, బీచ్ అందాలను రోడ్డు పక్కన చూసెలా నిర్మించనున్నారు.
Read also: Tirumala: తిరుమలేశుని దర్శన సేవలపై అభిప్రాయ సేకరణ