ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ రంగంలో కీలక మలుపు తిప్పే ప్రకటన త్వరలోనే వెలువడనుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara lokesh) తెలిపారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. కాకినాడ కేంద్రంగా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో (సుమారు రూ.83,400 కోట్లు) భారీ ప్రాజెక్టును తీసుకురానున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 8 వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
Read also: Sankranti Traditions:కోళ్ల పందేలు ఎన్ని రకాలుంటాయో తెలుసా..?
Andhra Pradesh will become another Saudi Arabia
ఏపీ మరో సౌదీ అరేబియాగా మారబోతోందా?
గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో సౌదీ అరేబియాగా అవతరించే దిశగా అడుగులు వేస్తోందని నారా లోకేశ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాకినాడ నుంచి జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతులు జరగనున్నాయని తెలిపారు. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, అంతర్జాతీయ పెట్టుబడులకు మరింత బలం చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అధికారిక ప్రకటన
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు నారా లోకేశ్ స్పష్టం చేశారు. “కాకినాడ నుంచి ప్రపంచానికి” అనే క్యాప్షన్‌తో ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రకటనతో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, యువతకు ఉద్యోగ అవకాశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఇది ఏపీకి చరిత్రాత్మక ఘట్టంగా మారనుందని రాజకీయ, ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: