Kakani Govardhan Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతి కోసం చేపట్టిన ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపించారు.
Read Also: Juvvaladinne Fishing Harbour: జువ్వలదిన్నె హార్బర్‌లో టాస్క్ ఫోర్స్ నిఘా..అక్రమ వేటకు చెక్!
జువ్వలదిన్నె హార్బర్ – మత్స్యకారుల ఆస్తి
నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్ జగన్ ఇచ్చిన గొప్ప ఆస్తి అని కాకాణి పేర్కొన్నారు. హార్బర్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం ద్వారా మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రైవేటీకరణ నిర్ణయంతో వేల సంఖ్యలో మత్స్యకార కుటుంబాలు మళ్లీ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎంతో శ్రమించి నిర్మించిన ఈ హార్బర్ ఇప్పుడు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లడం మత్స్యకారులకు చేస్తున్న ద్రోహమని ఆయన అన్నారు.
Kakani Govardhan Reddy: వైసీపీ అండగా ఉంటుంది – పోరాటం తప్పదు
మత్స్యకారులకు అన్యాయం జరుగుతుంటే వైసీపీ చూస్తూ ఊరుకోదని కాకాణి హెచ్చరించారు. “మత్స్యకారుల హక్కుల కోసం మేము అండగా నిలబడతాం. వారి జీవితాలను ఆగం చేసే ఏ నిర్ణయాన్నైనా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం” అని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో మత్స్యకారులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.

ప్రభుత్వ తీరుపై విమర్శలు
ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమవుతోందని, క్షేత్రస్థాయిలో మత్స్యకారులకు అందుతున్న లబ్ధి సున్నా అని కాకాణి విమర్శించారు. మత్స్యకార భరోసా వంటి పథకాలను సక్రమంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: