📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

Kakani Govardhan Reddy : ఇరిగేషన్ అధికారులపై రెచ్చిపోయిన కాకాణి

Author Icon By Sudheer
Updated: December 21, 2025 • 6:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులపై బహిరంగంగానే తీవ్ర స్థాయి హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇరిగేషన్ విభాగంలోని ఇన్‌చార్జి ఎస్ఈ దేశీనాయక్, మేనేజర్ గంగాధర్ రెడ్డిలు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. “పదవీ విరమణ చేసినా వదిలిపెట్టను, లెక్కలన్నీ సరి చేయిస్తాను.. మీ ఆస్తులు అమ్మించి మరీ కక్కిస్తాను” అంటూ ఆయన అధికారులను బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం ఒక పార్టీకి కొమ్ముకాస్తోందనేది కాకాణి ప్రధాన ఆరోపణ.

YSRCP: జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సోదరి షర్మిల

అయితే, ఈ గొడవకు ప్రధాన కారణం సర్వేపల్లి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న భారీ అవినీతి. ఇటీవల ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాను వెంటబెట్టుకుని క్షేత్రస్థాయిలో పర్యటించి, పనులు పూర్తి కాకుండానే కోట్లాది రూపాయల బిల్లులు ఎలా డ్రా చేశారో ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో సుమారు రూ.150 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై విజిలెన్స్ విచారణ కూడా జరగడం, ప్రాథమికంగా కొన్ని అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడం కాకాణిని ఆత్మరక్షణలో పడేశాయి.

సోమిరెడ్డి చేస్తున్న నిర్దిష్టమైన అవినీతి ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా, కాకాణి గోవర్ధన్ రెడ్డి నేరుగా అధికారులపై ఎదురుదాడికి దిగడం గమనార్హం. ఇది అధికారుల నైతిక ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నమని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన పనుల బిల్లులు, నాణ్యతపై ప్రభుత్వం విచారణను వేగవంతం చేయడంతోనే మాజీ మంత్రి ఇలా అసహనానికి గురవుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి సర్వేపల్లిలో ఇరిగేషన్ నిధుల వ్యవహారం ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Ap Google News in Telugu Kakani angry with irrigation officials Kakani Govardhan Reddy ycp

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.