శ్రీ సత్యసాయి జిల్లా కదిరి(Kadiri) పట్టణంలోని పద్మావతి ఆసుపత్రిలో విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లి, బిడ్డ మృతి చెందారని ఆరోపిస్తూ బాధితులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
Read Also: Guntur murder case: బిర్యానీతో భర్తను మట్టుబెట్టిన భార్య
ఘటన వివరాలు
ఎన్పీ కుంట మండలం(NP Kunta) జౌకల గ్రామానికి చెందిన హరిణి అనే మహిళ వారం క్రితం ప్రసవం కోసం కదిరిలోని పద్మావతి ఆసుపత్రిలో చేరారు. మంగళవారం తెల్లవారుజామున హరిణితో పాటు ఆమె జన్మనిచ్చిన ఆడబిడ్డ కూడా మృతి చెందారు. సరైన సమయంలో వైద్యులు స్పందించకపోవడం వల్లే ఈ అనర్థం జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
రోడ్డుపై ధర్నా
వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువులు, సీపీఐ మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆసుపత్రి ముందు రోడ్డుపై ధర్నా చేపట్టారు. దీనివల్ల కదిరిలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని, బాధితులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: