Kadapa ACB Raid: కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో అవినీతి తిమింగలాలు ఏసీబీ వలకు చిక్కాయి. ఒక కేసు విషయంలో సానుకూలంగా వ్యవహరించేందుకు సీఐ వెంకటరమణ, ఎస్ఐ అనిల్ కుమార్ కలిసి రూ. 1.50 లక్షలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, సోమవారం సాయంత్రం ఆ నగదును తీసుకుంటుండగా ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Read Also: Read Also: CM Chandrababu Vizianagaram Visit: ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు:రాంసుందర్ రెడ్డి
నివాసాల్లోనూ సోదాలు – బంగారం గుర్తింపు
అరెస్ట్ అనంతరం ఏసీబీ బృందాలు సీఐ, ఎస్ఐ నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. సీఐ వెంకటరమణ ఇంట్లో జరిపిన తనిఖీల్లో సుమారు 20 తులాల బంగారంతో పాటు కీలకమైన ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.
Kadapa ACB Raid: విచారణ ముమ్మరం
ప్రస్తుతం సీఐ మరియు ఎస్ఐ ఇద్దరినీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. వీరిద్దరిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి, ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఒకే స్టేషన్‌లో ఇద్దరు కీలక అధికారులు ఏకకాలంలో దొరికిపోవడం జిల్లా పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: