కడప క్రైం(Kadapa Crime) : కడప నగరంలోని శంకరాపురానికి చెందిన ఒకే మనవరాలు, కుటుంబానికి చెందిన వారు కొన్ని గంటల తేడా తో నలుగురు నిండు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు భార్యభర్తలు, వారికి చెందిన పసి కందుతో పాటు మృతుని నాయనమ్మ గుండెపోటుతో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కుటుంబ సభ్యులలో వృద్దురాలి మనవడు. మునిమనవడితో సహా కడప(Kadapa Crime) రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కడవ నగరంలోని శంకరాపురంలో శ్రీరాములు(27), అతని భార్య వెంకట సుబ్బమ్మలు వృద్ధ దంపతులు. వీరి కుమారుడు రామకృష్ణ, పద్మావతిలకు రవలి, శ్రీరాములు అనే ఇద్దరు సంతానం ఉన్నారు. శ్రీరాములుకు మూడేళ్ల క్రితం నగరానికి చెందిన శిరీషతో వివాహం జరిగింది. వీరికి రుత్విక్ (1) కుమారుడు ఉన్నాడు.
Read Also: Mask: సూపర్ సక్సెస్ దిశగా దూసుకెళ్లిన మస్క్ స్పెస్ ఎక్స్ రాకెట్
శ్రీరాములుస్థానిక చెన్నూరు బస్టాండు సమీపంలోని ఓ వైద్యురాలి వద్ద ఫార్మశీ విభాగంలో విధులు చేసస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో విధులు ముగించుకొచ్చాడు. ఆ సమయంలో మద్యం సేవించి శ్రీరాములు ఇంటికి వచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు శ్రీరాములును మందలించారు. దీంతో ఆయన ఆయన కుటుంబంతో ఆటోలో బయటకు వెళ్లాడు. అదే వీదిలో చివరలోని స్నేహితుడు పలకరించగా రైల్వేస్టేషన్కు(railway station) వెళ్తున్నామన్నాడు. సదరు వ్యక్తి ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వెంకట సుబ్బమ్మ ఆకస్మిక మృతి చెందింది. వైద్యులను పిలిపించి పరిశీలించగా మృతి చెందినట్లు తెలుస్తోంది. శ్రీరాములు(23), శిరీష(21), రుత్విక్లు రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. రైల్వే స్టేషన్ నుంచి కమలాపురం వైపు నడుచుకుంటూ రైల్వే ట్రాక్పై గూడ్సు రైలు రాగానే పట్టాలపై పడుకొని మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ముగ్గురు మృతి చెందడం విషాధం నింపింది. ఒకే కుటుంబంలో 4 మరణాలు గంటల వ్యవధిలో జరగడంతో శంకరాపురంలో విషాధచాయలు అలుము కున్నాయి. సమాచారం తెలుసుకున్న బంధు వులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు.
కడప రైల్వే ఇన్స్ పేక్టర్ సుధాకర్రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్క తర లించారు. ఆత్మహత్యకు గల కారణాలను లోతు గా దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వివరించారు. కేవలం మద్యం సేవించి రోజూ ఇంటికి వస్తున్నాడన్న కారణంగా చోటు చేస కున్న మనస్పర్థలతో ఆ కుటుంబం మృతి చెంద డంతో ఒక్కసారిగా కుటుంబం చిన్నాభిన్నం అయింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: