📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

KA Paul: నా కొడుకు అమెరికా అధ్యక్షుడు కావాలని కోరిన కేఏ పాల్

Author Icon By Sharanya
Updated: July 12, 2025 • 5:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అమెరికాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు దేశాన్ని రక్షించలేవని, అందుకే ప్రజలకు ఓ మూడో ప్రత్యామ్నాయ పార్టీ అవసరం అని ఆయన స్పష్టం చేశారు. అమెరికా రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషించాలనుకుంటున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తో కలిసి పనిచేసే అవకాశాలున్నాయని చెప్పారు. మస్క్ దగ్గర డబ్బు ఉంది, తనకు ఫాలోయింగ్ ఉందని అన్నారు. తన కుమారుడు అమెరికాలోనే పుట్టి పెరిగాడని తన కుమారుడు అమెరికాకు ప్రెసిడెంట్ కావాలనేదే తన కోరిక అని చెప్పారు.

నిమిష ప్రియ ఉరిశిక్షపై హ్యూమానిటేరియన్ విజ్ఞప్తి:


ఇటీవల యెమెన్ లో పని చేస్తున్న కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష (Nimisha Priya’s death sentence) పైనా కేఏ పాల్ (KA Paul) స్పందించారు. ఈ నెల 16న ఆమెకు శిక్షను అమలు చేయబోతున్నారు. తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీని 2017లో ఆమె హత్య చేశారు. 2020లో ఆమెకు ఉరిశిక్ష విధించారు. ఫైనల్ అప్పీల్ 2023లో రిజెక్ట్ అయింది. ఆమెకు క్షమాభిక్షను ప్రసాదించాలని పాల్ కోరారు.

నిమిష ప్రియకు క్షమాభిక్ష పెట్టాలని యెమెన్ ప్రధానికి లేఖ రాశానని పాల్ తెలిపారు. ప్రియ ఎన్నో కష్టాలు పడిందని ఆమె బిజినెస్ పార్ట్ నర్ ఆమెకు నరకం చూపించాడని చెప్పారు. ఆయన నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఆయనను హత్య చేసిందని ఆమె చేసిన హత్యను ఖండిస్తున్నానని కానీ, ఆమెకు క్షమాభిక్ష పెట్టాలని కోరారు. ఆమెకు క్షమాభిక్ష పెడితే యెమెన్ ప్రెసిడెంట్ ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తామని చెప్పారు. యెమెన్ లో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు .

KA Paul ఎవరు?


KA Paul పూర్తి పేరు కిలారి ఆనంద్ పాల్. ఆయన ఒక క్రైస్తవ మతప్రచారకుడు, మానవహితైషి మరియు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు. భారత్‌లో మరియు అంతర్జాతీయంగా శాంతి, మానవతా కార్యక్రమాలు నిర్వహించారు.

KA Paul ఏం చెప్పారు తన కొడుకు గురించి?


తన కొడుకు అమెరికాలోనే పుట్టి పెరిగాడని, అమెరికా అధ్యక్షుడిగా కావాలన్నది తన కోరిక అని చెప్పారు. మూడో పార్టీగా అమెరికా రాజకీయాల్లో పాల్గొనాలన్న సంకల్పాన్ని కూడా తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Anam Ramanarayana Reddy: టీటీడీ భక్తులకు మెరుగైన సేవలకు కార్యాచరణ ప్రణాళిక

#KAPaulSpeech Breaking News KAPaul KApaulSon KApaulVision latest news Telugu News USPresident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.