📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Latest news: KA Paul: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కేఏ పాల్ ఆగ్రహం

Author Icon By Saritha
Updated: November 13, 2025 • 5:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్‌లో ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రభుత్వ(KA Paul) నిర్ణయంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పీపీపీ కాదు బిలియనీర్ల ప్రోగ్రామ్ (PPB) అని ఆయన విమర్శించారు. మెడికల్ విద్యను వాణిజ్యరంగంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఈ నిర్ణయాన్ని తాను హైకోర్టులో సవాలు చేసినట్లు తెలిపారు.

Read also: కేకేఆర్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా షేన్‌ వాట్సన్‌

KA Paul: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కేఏ పాల్ ఆగ్రహం

ప్రజల ఆస్తులను లీజు పేరుతో అమ్మేస్తున్నారు

గురువారం మీడియాతో మాట్లాడిన కేఏ పాల్(KA Paul) పీపీపీ విధానం వల్ల కర్ణాటకలో వేలాది ఉద్యోగులు నష్టపోయారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్తులను 33 ఏళ్ల లీజు పేరుతో ప్రైవేటు చేతుల్లోకి ఇచ్చి అమ్ముతున్నారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్‌ను ఎలా అమ్మేస్తారో, ఇప్పుడు మెడికల్ కాలేజీలను కూడా అదే విధంగా అప్పగిస్తున్నారు. క్యూబా వంటి చిన్న దేశం ఉచిత విద్య, వైద్యం అందిస్తుంటే మన దేశం ఎందుకు చేయలేకపోతోంది? అని ఆయన ప్రశ్నించారు. పాలన చేయలేకపోతే రాజీనామా చేయాలని ప్రభుత్వానికి సలహా ఇస్తూ, దేశం ఎలా నడపాలో నాకు తెలుసు అని వ్యాఖ్యానించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై(Pawan Kalyan) కూడా కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ ఇప్పుడు మౌనం ఎందుకు వహిస్తున్నారు? సుగాలి ప్రీతి ఘటనపై ఎందుకు స్పందించడం లేదు? అని నిలదీశారు. విశాఖపట్నం సదస్సులో లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం చెప్పిందని, దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని, ముఖ్యమంత్రికి లంచాలు లేకుండా నారాయణ లాంటి వారు మెడికల్ కాలేజీలను పొందగలరా అని ప్రశ్నించిన పాల్, నాకు FCRA అనుమతులు లేవు, మీరు సంతకం చేస్తే రెండు వారాల్లో రూ.5 వేల కోట్లు తెచ్చి చూపిస్తా అని సవాల్ విసిరారు. స్టీల్ ప్లాంట్ అమ్మకం సందర్భంలో అదానీ తనను కలిసినట్లు కూడా సంచలన వ్యాఖ్య చేశారు.

తాను వేసిన పిల్ హైకోర్టులో కొట్టివేయబడలేదని అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతానని ఆయన స్పష్టం చేశారు. జగన్ నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, కానీ చంద్రబాబు ఇంకా నా ఆశీస్సులు పొందలేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh politics Chandrababu Naidu ka paul KA Paul PIL Latest News in Telugu PPP medical colleges privatization of education

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.