📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

KA Paul: ఆర్సీబీ ఘటనపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం

Author Icon By Sharanya
Updated: June 6, 2025 • 4:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరులో ఇటీవల జరిగిన ఆర్సీబీ విజయోత్సవాలు దురదృష్టకర ఘటనగా మారాయి. చిన్నస్వామి స్టేడియం వెలుపల అభిమానుల గుంపులు భారీగా కూడగట్టడం వల్ల తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా. కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది యావత్ దేశానికి కలుగు ప్రమాద సూచిక – కేఏ పాల్

బెంగళూరులో పోలీసులు అనుమతి ఇవ్వకుండా, ఆపకుండా వేలు, లక్షల మందితో పరేడ్ చేసుకోవడం, ఆ సెలబ్రేషన్స్‌లో 11 మంది చనిపోవడం, 50 మంది గాయపడటం చూస్తుంటే దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో లక్షల మందితో పరేడ్‌కు ఎలా అనుమతించిందని ఆయన ప్రశ్నించారు.

నా ప్రార్థన సభలకు మాత్రం ఆంక్షలు విధిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. నా సభకు వెయ్యి మందితో జింఖానా గ్రౌండ్స్‌లో, కళ్లు మూసుకుని, ప్రీచింగ్ చేయకుండా కేవలం ప్రేయర్స్ చేసుకోవాలని ఆంక్షలు పెడుతున్నారు.

ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయమా?

కొందరికి ఒక న్యాయం, మరికొందరికి మరో న్యాయమా?” అని నిలదీశారు. “ఇష్టం వచ్చినట్టు కొంతమంది పోలీసులు చేస్తున్నారు, అందరూ కాదు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మార్పు రావాలి” అని పాల్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం ఉందా, లేదా అనే సందేహం కలుగుతోందని, ఈ మార్పును మనమే తీసుకురావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విషయాలపై తాను స్పందిస్తానని, అవసరమైతే రంగంలోకి దిగుతానని పాల్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల దుర్మార్గం: నడిరోడ్డుపై థర్డ్ డిగ్రీ

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రోజుల క్రిందట ముగ్గురు యువకులను నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి పోలీసులు కొట్టడం చట్ట విరుద్ధం. ఇది ఆలోచిస్తుంటే చాలా విచారంగా, షాక్‌గా ఉంది అని అన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు.

నిర్మల్‌లో రైతు బిడ్డను అవమానించిన పోలీస్ ఘటనపై ఆవేదన

పాల్ తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో చోటుచేసుకున్న మరో సంఘటనను ప్రస్తావిస్తూ,

నిర్మల్‌లో ఒక రైతు బిడ్డ ఎంఆర్ఓ ఆఫీస్‌కు వెళితే, ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన ఒక దొంగో, టెర్రరిస్టో అయినట్టు బయటకు నెట్టేయడం బాధాకరం. తెలంగాణలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి అని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిదీ. అవసరమైతే నేను ప్రజల తరఫున మళ్ళీ రంగంలోకి దిగతాను,” అని స్పష్టం చేశారు. ప్రజలు ప్రశ్నించాలనీ, ఈ రకమైన వ్యవహారాలను సహించరాదని పాల్ అన్నారు.

Read also: RCB: ఆర్సీబీ ఘటనలో ఆంధ్ర బాలిక మృతి

#IPLControversy #KAPaul #KAPaulSpeech #PoliticalComments #RCBControversy Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.