📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

K Vijayanand: వ్యవసాయ ఫీడర్లకు 9 గంటల విద్యుత్ సరఫరా

Author Icon By Anusha
Updated: July 9, 2025 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వినియోగదారులకు అంతరాయం లేకుండా నాణ్యమైన సరఫరా

విజయవాడ : విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా కు అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుండి ఏపీఈపీడీసిఎల్, ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరా (Power supply) గురించి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ పృద్వి తేజ్, ఏపీఎస్పీడీసిఎల్ సిఎండీ కే సంతోష రావు, ఏపీట్రాన్స్కో గ్రిడ్ డైరెక్టర్ ఏకెవీ భాస్కర్ లతో సిఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, విద్యుత్ సరఫరాలో ఏవైనా అంతరాయాలు తలెత్తితే తక్షణం స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, విద్యుత్ అంతరాయాలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. సర్వీస్ వైర్ (కండక్టర్ ) వల్ల ఏమైనా సమస్యలు తలెత్తితే సర్వీస్ వైర్లు మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

తక్షణం పరిష్కరించి నిరంతర విద్యుత్

ఒకసారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటే మళ్ళీ అదే సమస్య పునరావృతం కారాదని సూచించారు. ఎక్కడైనా పవర్ కండక్టర్ తెగిపోతే, ఎందుకు కట్ అయ్యిందో తెలుసుకోవాలని, అలాగే పాత కండక్టర్లను గుర్తించి వాటిని మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలానికి గ్యాంగ్ లను ఏర్పాటు చేసి జంపర్లు హంగింగ్ వైర్లు (Hanging wires), లో వోల్టేజ్ సమస్యలను వెంటనే గుర్తించి తక్షణం పరిష్కరించి నిరంతర విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధులు గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకం అవుతున్నారని, ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా కు సంబంధించి ఏదైనా సమస్య విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

K Vijayanand: వ్యవసాయ ఫీడర్లకు 9 గంటల విద్యుత్ సరఫరా

వినియోగదారుల సంతృప్తి

సిఎండీ మొదలుకొని, లైన్ మెన్ వరకు అందరు అప్రమత్తంగా ఉంటూ తక్షణం విద్యుత్ సమస్యలు పరిష్కరించి వినియోగదారుల సంతృప్తి స్థాయి మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాలని సిఎస్ కె విజయానంద్ (K Vijayanand) ఆదేశించారు. వార్డు సచివాలయాల్లో పని చేసే విద్యుత్ సిబ్బంది పెన్షన్ పంపిణి రోజు మాత్రమే ఆ విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని మిగిలిన సమయాల్లో విద్యుత్ సంబందించిన సేవలకు ఉపయోగించుకోవాలని సిఎస్ సిఎండీలను ఆదేశించారు.

కె. విజయానంద ఎవరు?

1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి-Chief Secretaryగా, అలాగే ఎనర్జీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతున్నారు.

ఆయా శాఖల్లో ఆయన ప్రధాన పాత్రలు ఏమిటి?

ఫిబ్రవరి 2022 నుండి ఆయన APGENCO చైర్మన్ గా, ఏప్రిల్ 2023 నుండీ APTRANSCO CMD గా పనిచేస్తున్నారు; 2022‑23 కాలంలో ఎనర్జీ శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సేవలందించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: YS Sharmila: హైదరాబాదులో వైయస్సార్ మెమోరియల్ ఏర్పాటు చేయాలి: ఎపి పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

AndhraPradeshPowerSupply APEPDCL BreakingNews ContinuousElectricity CSKVijayanand latest news Telugu News VijayawadaNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.