📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

K. Ramakrishna : చంద్రబాబు పాలనలో మార్పు ఏది?

Author Icon By Shravan
Updated: July 28, 2025 • 2:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలో అప్పులు అధికం అభివృద్ధి శూన్యం

పోలవరాన్ని 45.72 మీటర్ల ఎత్తు పెంచాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

అనంతపురం : రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ మార్పు కనిపించడం లేదని, ఏపీ రాష్ట్రంలో అప్పుల అధికం అవుతున్నాయని అభివృద్ధి శూన్యం అని, పోలవరం ఎత్తు పెంచకపోతే రాయలసీమ, ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు. కూటమి నేతలు ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లు వద్దని చెప్పారని ఇప్పుడు మళ్లీ అమలు చేయ డంలో అర్థం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆదివారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ తో కలసి కె.రామకృష్ణ (K. Ramakrishna) మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రిని, హోం మంత్రి ఫైనాన్స్ మంత్రులను కలిసి అర్జీలు ఇచ్చేందుకే కాలం సరిపోతుందన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎటువంటి మార్పు లేదని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏ విధంగా వారికి పరిపాలించాడో అదే విధానాలను అవలంబిస్తున్నా రన్నారని ఆరోపించారు. విభజన హామీలు, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, కడప స్టీల్ ప్లాంట్ల గురించి వీటిపై ఏమీ మాట్లాడడం లేదన్నారు. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి జిందాల్ అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు జిందాల్ అంటున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పక్కాగా ప్రవేట్ అప్పగిస్తుంటే దానిని ఆపలేకపోతున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 4 వేలు మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడంతోపాటు 1,400 మంది పర్మినెంట్ కార్మికులకు వీఆర్ఎస్ ఇచ్చి పంపిం చడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మా ణాన్ని 45.72 మీటర్ల ఎత్తు నిర్మాణం జరిగితేనే పూర్తిస్థాయిలో నీటిని వినియోగించడం జరుగు తుందన్నారు. తద్వారా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు నీరు అందించడం వీలుంటుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఒక సంవత్సర కాలంలో రూ.1.50లక్షల కోట్లు అప్పులు చేయ డం జరిగిందన్నారు. ఒక అమరావతి రాజధాని నిర్మాణం కోసం 31వేల కోట్లు అప్పు చేశారని మరో రూ.31వేల కోట్లు అప్పులు తేవడానికి సిద్ధమ య్యారన్నారు. సింగపూర్ ఢిల్లీ పర్య టనలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారా లేక అప్పుల్లోకి తీసుకు పోతున్నారో విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. అధికారంలోకి రాక ముందు స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే పగల గొట్టాలని చెప్పిన పెద్దమనిషి అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్లను బలవంతంగా బిగిస్తు న్నారని దుయ్యబట్టారు. మద్యం కుంభకోణంలో రూ.3500 కోట్లు గత ప్రభుత్వం దోపిడీ చేశారని కూటమి ప్రభుత్వం చెబుతున్నారు. 12 మందిపై కేసులు పెట్టారు. అరెస్టు చేసిన వారిపై నిజాలను నిగ్గు తేల్చకుండా సిట్, కేంద్ర దర్యాప్తు సంస్థల పేరుతో కాలగర్భంలో కలిపేస్తారని ప్రజలు అను కుంటున్నారన్నారు. నిజాలను నిగ్గు తేల్చి ప్రజా ధనాన్ని రికవరీ చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్, పుట్టపర్తి జిల్లా కార్యదర్శి ఎం.వేమయ్య యాదవ్, అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి పి. నారాయణస్వామి, జిల్లా సిపిఐకార్యదర్శి వర్గ సభ్యులు జె. రాజారెడ్డి, అనంతపురం నగరసిపిఐ కార్యదర్శి ఎన్. శ్రీరాములు పాల్గొన్నారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Durga Temple Service : దుర్గమ్మవారి సేవలో ఎపి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి

Andhra Pradesh Ap Breaking News in Telugu k.rama krishna Latest News in Telugu Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.