Juvvaladinne Fishing Harbour: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జలాల్లోకి ఇతర రాష్ట్రాల బోట్లు అక్రమంగా చొరబడకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ ఆదివారం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్, రెవెన్యూ మరియు మత్స్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేపటి నుండి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా తీరం వెంబడి 22 కిలోమీటర్ల మేర పూర్తి సెక్యూరిటీతో కూడిన గస్తీ పడవను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.\
Read also: Nellore Police Raid: లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు!
టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు
తమిళనాడు మరియు పాండిచ్చేరి ప్రాంతాల నుండి హై స్పీడ్ మరబోట్ల ద్వారా మన రాష్ట్ర టెరిటోరియల్ వాటర్స్‌లోకి చొరబడి మత్స్య సంపదను దోచుకుపోతున్నారని, దీన్ని నివారించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (Task Force) బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఈ టీమ్‌లో మెరైన్ పోలీస్ నుండి ఒకరు, రెవెన్యూ శాఖ నుండి ఒకరు, మత్స్య శాఖ నుండి ఒకరు, అటవీ శాఖ నుండి ఒకరు మరియు స్థానిక ఫిషర్‌మెన్ సొసైటీ నుండి ఒక ప్రతినిధి ఉంటారు.ఈ నలుగురు సభ్యుల బృందం రేపటి నుండి నిరంతరం సముద్ర జలాల్లో పహారా కాస్తుంది.
Juvvaladinne Fishing Harbour: శ్రీహరికోట నుండి బాపట్ల వరకు నిఘా
ప్రభుత్వ సంపదను కాపాడటంలో భాగంగా తీరం నుండి 22 కిలోమీటర్ల దూరం వరకు మన సముద్ర జలాలు ఉంటాయని, ఈ పరిధిలో శ్రీహరికోట నుండి బాపట్ల వరకు నిరంతర గస్తీ ఉంటుందని రామ్ శంకర్ నాయక్ స్పష్టం చేశారు. గతంలో శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల కొంత జాప్యం జరిగిందని, ఇప్పుడు జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ సహకారంతో పక్కా ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు.

పాల్గొన్న ప్రముఖులు
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ జేడీ శాంతి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అక్రమ వేటను అరికట్టడం ద్వారా స్థానిక మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడటమే ఈ గస్తీ ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: