📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Justice Gavai: రాజ్యాంగం వల్లే హక్కులపై కోర్టుల్లో అప్పీలు

Author Icon By Sushmitha
Updated: November 17, 2025 • 10:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: పౌరుల ప్రాథమిక హక్కులకు (fundamental rights) భంగం కలిగినప్పుడు కోర్టులను ఆశ్రయించే హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్. గవాయ్ అన్నారు. 75 ఏళ్ల భారత రాజ్యాంగంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,(Chandrababu Naidu) ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ, సాంఘిక, ఆర్థిక న్యాయ సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారని తెలిపారు.

Read also : Dhaka Bomb Blasts : బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు ఉధృతం ఢాకాలో వరుస బాంబు పేలుళ్లు…

Justice Gavai

రాజ్యాంగంపై అంబేడ్కర్ ఆలోచన

రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చేసిన ప్రసంగం ప్రతి న్యాయవాదికి కంఠోపాఠం కావాలని జస్టిస్ గవాయ్(Justice Gavai) చెప్పారు. రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ఒక స్థిర పత్రంగా చూడలేదని, కాలానుగుణంగా మార్పులు అవసరమని భావించారని ఆయన తెలిపారు. కొన్ని అంశాల్లో రాజ్యాంగ సవరణ సులభమని, మరికొన్ని అంశాల్లో చాలా కఠినమని చెప్పారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే రిజర్వేషన్ల అంశంపై మొదటి సవరణ చేసుకున్నామని స్పష్టం చేశారు.

పదవీ విరమణకు ముందు చివరి కార్యక్రమం

ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అనేక మైలురాళ్లు అధిగమించామని, ఇప్పటివరకు 106 రాజ్యాంగ సవరణలు జరిగాయని వివరించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

Andhra Pradesh High Court Fundamental Rights Google News in Telugu Indian Constitution Justice BR Gavai Latest News in Telugu Reservation Creamy Layer Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.