📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Chandrababu : జర్నలిస్ట్ కంచర్ల రామయ్య మృతిపై చంద్రబాబు సంతాపం

Author Icon By Divya Vani M
Updated: June 19, 2025 • 9:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో సీనియర్ జర్నలిస్ట్‌గా, విద్యావేత్తగా గుర్తింపు పొందిన కంచర్ల రామయ్య (Kancharla Ramaiah) ఇకలేరు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సంతాపం ప్రకటించారు.రామయ్య పాత్రికేయుడిగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేశారని సీఎం అన్నారు. ఆయన స్థాపించిన ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ ద్వారా అనేకమంది విద్యార్థులు లబ్ధిపొందారని గుర్తుచేశారు. రామయ్య కుటుంబానికి ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నారా లోకేష్ భావోద్వేగ స్పందన

విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కూడా రామయ్య మృతిపై స్పందించారు. “ఈనాడు రామయ్య”గా ప్రసిద్ధి గాంచిన ఆయన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. జర్నలిజం, విద్య, సామాజిక సేవ ఇలా అన్నిరంగాల్లో రామయ్య ముద్రవేశారు అన్నారు.

రామయ్య సేవలు చిరస్మరణీయం: మంత్రి రవికుమార్

మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా తన సంతాపాన్ని తెలియజేశారు. రామయ్య ఒక ఉత్తమ జర్నలిస్ట్‌గా ఎదిగి, అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ఇంజినీరింగ్ విద్యను అందుబాటులోకి తెచ్చారని ప్రశంసించారు. ఆయన కుమారుడు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పలువురు ప్రముఖుల నుంచి సంతాపం

కంచర్ల రామయ్య మృతి వార్తపై పలు రాజకీయ, మీడియా, విద్యా రంగ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రామయ్య సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు పేర్కొన్నారు.

Read Also : CM Revanth Reddy : టోనీ బ్లెయిర్‌తో రేవంత్‌రెడ్డి భేటీ

CM Chandrababu condoles Deepest condolences to Ramaiah's family Journalist Kancharla Ramaiah Kancharla Ramaiah's death Nara Lokesh's response

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.