📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Jogi Ramesh – మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు

Author Icon By Anusha
Updated: September 18, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇబ్రహీంపట్టణంలో ఉద్రిక్తత

విజయవాడ : బూడిద మాఫియాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వైసిపి నేత, మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) ను పోలీసులు అరెస్టు చేయడంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. బూడిద డంపు వద్దకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని వైసిపి డిమాండ్ చేసింది. అయితే పోలీసులు 144 సెక్షన్ను విధించారు. నలుగురికి మాత్రమే అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు మూలపాడులో బూడిద డంపుకు వెళ్లకుండా జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

బూడిద రవాణా ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అక్రమార్జన చేశారని జోగి రమేష్ ఆరోపిస్తున్నారు. అయితే జోగి రమేష్ వ్యాఖ్యలను వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. దీంతో మూలపాడులో ఉద్రిక్తత ఏర్పడింది. ఈరోజు బూడిద డంపుకు వెళ్లడానికి వైసిపి సన్నద్ధమవ్వగా పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం నెలకొంది. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తతల నడుమ మాజీమంత్రి జోగి రమేష్, వారి అనుచరులను వైసిపి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ వైపు తరలించారు.

డంపింగ్ యార్డు వల్ల పరిసర ప్రాంతాలు మొత్తం కాలుష్యం

మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని ఫ్లయాష్ (బూడిద) డంపింగ్ యార్డ్ (Grey dumping yard) టెండర్లలో అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. ఈ డంపింగ్ యార్డు వల్ల పరిసర ప్రాంతాలు మొత్తం కాలుష్యం అవుతాయని అన్నారు. నేడు ఆయన ఆ బూడిద డంపింగ్ యార్డు సందర్శనకు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేసిన పోలీసు స్టేషన్కి తరలించారు. మధ్యాహ్నం భవానీ పురం పోలీస్ స్టేషన్ (Bhavani Puram Police Station) నుంచి ఆయన విడుదల అయ్యారు.

Jogi Ramesh

ఈ సందర్భంగా జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. వీటీపీఎస్లో ఫ్లయాష్ టెండర్లు రద్దు చేయాలని, అక్రమంగా బూడిద నిల్వ చేసి హైదరాబాద్కి  (Hyderabad) తరలించే ప్రక్రియను నిలిపివేయాలని మాజీ మంత్రి జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఈ బూడిద డంపింగ్ యార్డు వల్ల ఇబ్రహీంపట్నం పరిసరాల్లోని గ్రామాల్లో నీరు, గాలి కాలుష్యం బారిన పడే అవకాశం ఉంది.

పోరాటం కొనసాగిస్తాం అని ఆయన హెచ్చరించారు

గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బ తింటాయి. కాలుష్యం నుంచి సురక్షితంగా ఉండాలంటే చెట్లను పెంచాలి. తక్షణమే అక్రమ డంపింగ్ ను స్వాధీనం చేసుకోకపోతే మా పోరాటం కొనసాగిస్తాం అని ఆయన హెచ్చరించారు. లోకల్ లారీ ఓనర్స్ ను ఆదుకునే విధంగా టెండర్లు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. అలాగే, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులకు చెబితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని జోగి రమేష్ మండిపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/cm-chandrababu-100-digital-payments-in-liquor-shops-cm-chandrababu/andhra-pradesh/549517/

ash dump access demand ash mafia protest Breaking News former minister jogi ramesh ibrahimpatnam tension latest news Police Arrest Telugu News Vijayawada YSRCP leader

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.