📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Job Mela 2026: గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా

Author Icon By Anusha
Updated: February 26, 2026 • 2:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Job Mela 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా గన్నవరంలో భారీ ఉద్యోగ మేళాను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28, 2026 (శనివారం) ఉదయం 9 గంటలకు గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా ఈ మేళా ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read Also: AI Groundwater Estimation: ఏఐతో భూగర్భ జలాల అంచనాలు

రంగంలోకి టాటా ఎలక్ట్రానిక్స్ సహా ప్రముఖ కంపెనీలు

ఈ జాబ్ మేళాలో సుమారు 10కి పైగా ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి. నరేష్ కుమార్ తెలిపారు. పాల్గొనే ప్రధాన కంపెనీల జాబితా ఇక్కడ ఉంది:

Job Mela on February 28th in Gannavaram!

అభ్యర్థులకు సూచనలు: కావాల్సిన పత్రాలు ఇవే!

ఈ కంపెనీలలో ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బిటెక్(మెకానికల్, సివిల్) పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనం ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 28న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ఆసక్తి, తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా  వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు సదరు జాబ్ మేళాకు రెజ్యూమెలతో లేదా బయోడేటా ఫోరమ్‌లతో పాటు ఆధార్, ఆధార్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్, PAN, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలను తీసుకు రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9676708041, 9494005725 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

APSSDC Recruitment Drive Government Polytechnic College Gannavaram Jobs Job Mela 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.