Job-Fraud: మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం

Read Time:  1 min
Job-Fraud: మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం
FONT SIZE
GET APP

Job-Fraud: బాపట్ల జిల్లా కారంచేడు మండలం జరుబులవారిపాలెంకు చెందిన మనోజ్ కుమార్ కు తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన గిరి పరిచయం అయ్యాడు‌. ఖాళీగా ఉన్న మనోజ్ కుమార్ తో మైనింగ్ శాఖలో ఉద్యోగం ఉన్నట్లు నమ్మబలికాడు. ఉద్యోగం వస్తే డబ్బులివ్వడానికి సిద్దమైన మనోజ్ కుమార్.. గుంటూరుకు చెందిన సూర్య కుమార్ వద్దకు తీసుకెళ్ళారు. గిరి, సూర్య కుమార్ కలిసి విజయవాడలోని శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్ళారు. ఉద్యోగం కావాలంటే పదిహేను లక్షలు చెల్లించాలని చెప్పారు. దీంతో మనోజ్ కుమార్ పదిహేను లక్షల రూపాయలను శ్రీనివాసరెడ్డికి ఇచ్చాడు.

Read Also: AP Budget Sessions: అసెంబ్లీలో దివంగత మాజీ సభ్యులకు నివాళి

Job-Fraud: మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం
Job-Fraud: Fraudulent job offer in the mining sector

నెల రోజుల జీతం.. ఆపై క్వారీ మూసివేత

డబ్బులు చెల్లించగానే 2024 సెప్టెంబర్ లో బాపట్లలోని మైనింగ్ కార్యాలయం వద్దకు మనోజ్ కుమార్ ను పిలిపించారు. అక్కడ నియామక పత్రాలు, ఐడి కార్డు అందించారు. బాపట్ల సమీపంలోని క్వారీలో ఉద్యోగం అని చెప్పారు. క్వారీలో నెల రోజుల ఉద్యోగానికి పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించారు. అయితే రెండో నెలలోనే క్వారీ మూసి వేశారు. దీంతో అనుమానం వచ్చిన మనోజ్ కుమార్ తన ఉద్యోగం గురించి వాకబు చేయగా నకిలీ నియామక పత్రం, ఐడి కార్డ్ ఇచ్చినట్లు తేలింది. వెంటనే శ్రీనివాసరెడ్డిని కలిసి తనను మోసం చేసిన విషయాన్ని చెప్పి తన డబ్బులు తనకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు.

డబ్బులు తిరిగి రాకపోగా, నిందితులు ముఖం చాటేయడంతో మనోజ్ కుమార్ బాపట్ల పోలీసులను ఆశ్రయించాడు. గిరి, సూర్య కుమార్, శ్రీనివాసరెడ్డి కలిసి తనను మోసం చేశారని, తన రూ. 15 లక్షలు ఇప్పించడంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. మనోజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.