📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News: Kurnool Tragedy: తనతో పాటు ఏడుగురిని కాపాడిన జయసూర్య

Author Icon By Vanipushpa
Updated: October 24, 2025 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నూల్(Kurnool) బస్సు ప్రమాదంలో 20 మంది చనిపోయిన విషాద ఘటన రెండు తెలుగు రాష్ట్రా్లలో సంచలనంగా మారింది. హైదరాబాద్ నుంచి బెంగూళూర్ వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్(Kaveri Travels) శుక్రవారం తెల్లవారుజామున 2.40 నిమిషాలకు ముందు వెళ్లున్న బైక్‌ను ఢీకొట్టింది. బైక్ నుంచి మంటలు బస్సుకు వ్యాపించాయి. నిమిషాల్లోనే బస్సు మొత్తం ఆ మంటలు వ్యాపించాయి. ఈ ఘోర ప్రమాదంలో కొద్ది మంది మాత్రమే తప్పించుకోగలిగారు. అందులో జయస్యూర్య అనే ఓ బీటెక్ స్టూడెంట్ గాయాలతో బతికి బయటపడ్డాడు. అతనితోపాటు మరో ఏడుగురి ప్రాణాలు కాపాడారు జయసూర్య. యువకుడు దైర్యం చేసి సమయస్పూర్పితో బస్సు అద్దాలు పగలగొట్టాడు. అతని వెంటే కొందరు అదే కిటికి నుంచి బయటపడ్డారు. బస్సు అద్దాలు పగలగొట్టడానికి జయసూర్యకు బయటనుంచి మహేష్ అనే వ్యక్తి సాయం చేశాడు.

Read Also: Maharashtra crime: స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ అత్యాచారం తో  మ‌హిళా డాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య

Kurnool Bus Tragedy

ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వెళ్తున్న జయసూర్య

హైదరాబాద్ మియాపూర్‌లో నివాసం ఉండే జయసూర్య ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వెళ్తున్నాడు. ఈ క్రమంలో తను బుక్ చేసుకున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు మియాపూర్ లో మిస్సైంది. దీంతో ఛేజింగ్ చేసి మరీ మూసాపేట్ లో బస్సు ఎక్కాడు. ఉద్యోగం కోసం గంపెడాశలతో వెళ్తున్న స్టూడెంట్.. చివరికి ప్రమాదానికి గురయ్యాడు. ఎట్టకేలకు బతికి బయటపడ్డాడనే వార్త విని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ పూర్తి

కడప జిల్లా జమ్మలమడుగు మండలం నెమలి దిమ్మె గ్రామానికి చెందిన జయసూర్య.. తల్లి తండ్రులు రమా దేవి, సుబ్బారాయుడుతో కలిసి మియాపూర్ మక్త మహబూబ్ పేట్ లోని ప్రజా షెల్టర్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ పూర్తిచేసిన జయసూర్య.. బెంగళూరులో ఇంటర్వ్యూ ఉందంటూ గురువారం (అక్టోబర్ 23) సాయంత్రం ఇంట్లో నుండి బయలుదేరాడు. జయసూర్య వెళ్లిన బస్సు ప్రమాదానికి గురైన వార్త విని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గరయ్యారు. తమ కొడుకు ఆచూకీ కోసం టెన్షన్ పడుతున్న సమయంలో.. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఫోన్ చేశాడు జయసూర్య. తను క్షేమంగానే ఉన్నానని పేరెంట్స్ కు చెప్పాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Brave act heroic act Human interest story Indian Cinema Jayasurya Kerala News Latest News Breaking News malayalam actor Rescue news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.