📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Janasena- సుగాలి ప్రీతి కేసు..స్పందించిన జనసేన

Author Icon By Hema
Updated: August 29, 2025 • 3:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి హత్య కేసు మళ్లీ రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ప్రీతి తల్లి పార్వతి చేసిన ఆరోపణలపై, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్టించుకోలేదని, జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. పవన్ చొరవ లేకుంటే ఈ కేసు అప్పటికే మరుగున పడిపోవుతుందని పార్టీ తెలిపింది. 2017 ఆగస్టులో సుగాలి ప్రీతి హత్య జరిగింది. ఈ ఘటన 2019 డిసెంబర్‌లో పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. 2019 ఎన్నికల్లో (election) ఓటమి ఎదుర్కొన్నప్పటికీ, బాధితుల తల్లిదండ్రులు పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ వారికి న్యాయం జరిగే వరకు అందరి ముందే పోరాడతానని హామీ ఇచ్చారని పార్టీ గుర్తు చేసింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో, 2020 ఫిబ్రవరి 12న పవన్ కల్యాణ్ కర్నూలులో ‘ర్యాలీ ఫర్ జస్టిస్’ నిర్వహించారు. ఆ సభలో ప్రీతి తల్లి పార్వతి, తమ బిడ్డకు న్యాయం (justice) కోసం గళం వినిపించిన మొదటి నాయకుడు పవన్ కల్యాణ్ అని స్పష్టంగా చెప్పారని జనసేన పేర్కొంది.

సీబీఐకి కేసు బదిలీ

2020 ఫిబ్రవరి 27న, వైసీపీ ప్రభుత్వ ఒత్తిడి వల్ల కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. అయితే, జీవో ఇచ్చి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విచారణ ముందుకు సాగలేదని పార్టీ పేర్కొంది.

Janasena:సుగాలి ప్రీతి కేసు..స్పందించిన జనసేన

అధికారంలోకి వచ్చాక పవన్ కల్యాణ్ చర్యలు

పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే బాధితులను కలవడం, హోంమంత్రికి కేసు వేగవంతం చేయమని సూచించడం, కేసు కొనసాగింపులో చొరవ చూపడం వంటి చర్యలు తీసుకున్నారు. జనసేన ప్రకటన ప్రకారం, పవన్ కల్యాణ్ చొరవ వల్లే కేసు ఇంతవరకైనా ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆయనను ప్రశ్నించడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది.

సుగాలి ప్రీతి హత్య కేసు ఎప్పుడూ జరిగింది?
2017 ఆగస్టులో.

పవన్ కల్యాణ్ ఈ కేసుపై ఎప్పుడు చొరవ చూపారు?
ఈ ఘటన 2019 డిసెంబర్‌లో దృష్టికి వచ్చింది. 2020లో కర్నూలులో ‘ర్యాలీ ఫర్ జస్టిస్’ నిర్వహించారు

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-vandebharath-vande-bharat-trains-central-key-decision/business/537813/

#cbiinvestigation #JanaSenaParty #KurnoolNews #PawanKalyan #SugaliPreethiCase Google News in Telugu Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.