Janasena Office Attack Mangalagiri: మంగళగిరిలోని జనసేన పార్టీ, రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఒక వ్యక్తి కార్యాలయంలోకి చొరబడి, అక్కడే ఉన్న రెండు కార్ల అద్దాలను రాడ్డుతో విచక్షణారహితంగా ధ్వంసం చేశాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు.
Read Also: APPSC : గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టులో విచారణ
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సమాచారం అందుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు హుటాహుటీన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొని కార్లను ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: