📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest Telugu News: Janasena: రాయుడు హత్య కేసులో జనసేన నేత అరెస్ట్!

Author Icon By Vanipushpa
Updated: October 17, 2025 • 5:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీకాళహస్తి రాయుడు హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తిరుపతిలోని వెంకటగిరిలో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై పోస్ట్ పెట్టినందుకు జనసేన(Janasena) జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తి జనసేన నేత కోటా వినూతకు న్యాయం చేయాలని పోస్ట్ చేశాడు వెంకటేశ్వర్లు. అంతేకాకుండా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని వెంకటేశ్వర్లు డిమాండ్‌ తన పోస్టులో డిమాండ్ చేశాడు. దీంతో, ఆ పోస్టు వైరల్‌గా మారింది. ఈ క్రమంలో కూటమి ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా మాట్లాడినందుకే అరెస్ట్ చేశారని విమర్శలు వస్తున్నాయి. వెంకటేశ్వర్లు అరెస్ట్‌పై ఆయన కుటుంబీకుల మండిపడుతున్నారు. వెంకటేశ్వర్లను పోలీసులు దౌర్జన్యంగా తీసుకెళ్లారని, స్నానం చేస్తున్నారని చెప్పిన వినిపించుకోలేదని తెలిపారు.

Read Also: GST: భవిష్యత్తును మార్చేది సంస్కరణలే: చంద్రబాబు

Janasena: రాయుడు హత్య కేసులో జనసేన నేత అరెస్ట్!

సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో

ఇదిలా ఉండగా.. కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు ప్రైవేటుగా ఉన్న వీడియోలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి రూ.30 లక్షలు ఇస్తానని చెప్పారంటూ వినుత మాజీ డ్రైవర్‌ రాయుడు గతంలో విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 19 నిమిషాల 42 సెకన్ల సెల్ఫీ వీడియో బయటకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించింది.: ఈ వీడియోలో, రాయుడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మనుషులు తనను సంప్రదించి, వినుత దంపతులను చంపాలని లేదా కనీసం కోట వినుత ప్రైవేట్ వీడియోలు తీసి పంపాలని బెదిరించారని, అందుకు డబ్బు కూడా ఆఫర్ చేశారని తెలిపాడు.

జనసేన పార్టీ నుంచి కోట వినుత భర్త సస్పెండ్

అయితే అప్పట్లో అది అతనే తీశాడా? లేక కోటా దంపతులు బెదిరించి తీయించారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ హత్య ఘటన తరువాత కోట వినుత ఆమె భర్తను జనసేన పార్టీ సస్పెండ్ చేసింది. శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యకు గురయ్యారు. జూలై 7న హత్య జరిగి, జూలై 13న చెన్నైలోని కూవం నదిలో ఆయన మృతదేహం లభ్యమైంది.బఈ హత్య కేసులో కోట వినుత, ఆమె భర్త చంద్రబాబుతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కోట వినుతకు చెన్నై సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆమె భర్త చంద్రబాబు (ఏ1) సహా మిగిలిన నిందితులు ఇంకా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నట్లు తెలిసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh politics Janasena Leader Arrested Latest News Breaking News Law and order murder investigation Political Crime Rayudu Murder Case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.