📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Janasena Formation Day: నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Author Icon By Saritha
Updated: March 14, 2026 • 1:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Janasena Formation Day: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులు వేడుకలను సిద్ధమయ్యారు. అయితే, ఈ ఏడాది పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని గిరిపుత్రుల మధ్య జరుపుకోవాలని పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని నందిగరువు గ్రామంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) పర్యటించనున్నారు.

Read Also: CM Chandrababu: మహిళల జోలికొస్తే ఖబడ్డార్.. నేరగాళ్లపై డ్రోన్ నిఘా!

Janasena Formation Day: Janasena Formation Day celebrations held today in a tribal village.

గిరిజనులతో మాటా-మంతి కార్యక్రమం

ఈ పర్యటనలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు. గిరిజనుల కష్టసుఖాలను తెలుసుకుంటూనే, వారి మధ్య పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు. తొలుత ఓనూరు జంక్షన్ వద్ద జనసేన జెండాను పవన్ కల్యాణ్ ఆవిష్కరిస్తారు. అనంతరం పిఎం జన్ మన్ పథకం కింద నిర్మించిన రోడ్లను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు వరకు నిర్మించిన 2.4 కి.మీ రహదారిని కాలినడకన ప్రయాణిస్తూ పనుల నాణ్యతను తనిఖీ చేస్తారు.

తర్వాత నందిగరువు గ్రామ ప్రజలతో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు మాటా-మంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పర్యటన చివరలో గిరిజనులతో కలిసి పవన్ కల్యాణ్ మధ్యాహ్న భోజనం చేస్తారు. అధ్యక్షుడి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో జనసైనికులు సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే పార్టీ ప్రధాన లక్ష్యమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Deputy CM Pawan Kalyan Janasena 13th Anniversary janasena formation day Latest News in Telugu Pawan Kalyan Paderu Visit Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.