📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమాధానం

Author Icon By Uday Kumar
Updated: March 5, 2025 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమాధానం

శాసనమండలిలో కడప – రేణిగుంట నూతన జాతీయ రహదారుల పనుల విషయమై గౌరవ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, దువ్వారపు రామారావు, బి తిరుమల నాయులు అడిగిన ప్రశ్నకు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. కడప రేణిగుంట కొత్త జాతీయ రహదారి పనులు ప్రారంభం కాకపోవడం నిజమేనని మంత్రి తెలిపారు.

అటవీ అనుమతుల ఆలస్యం

అటవీ, వన్యప్రాణుల అనుమతులు పొందడంలో ఆలస్యం జరిగిందని మంత్రి వివరించారు. అటవీ అనుమతి (1వ దశ) 11-12-2024 తేదీన పొందడమయింది. అయితే, నాలుగు లేన్ల పనులు ప్రారంభంపై ప్రభావం చూపే వివిధ కారణాల వల్ల అటవీ /వన్యప్రాణుల/ ఈఎస్ జెడ్ అనుమతులు పొందడం ఆలస్యం అయింది.

వన్యప్రాణుల అనుమతి ప్రక్రియ

21-12-2024 తేదీన జరిగిన వన్యప్రాణుల జాతీయ సంస్థ (ఎస్ సీ-ఎన్బీడబ్ల్యుఎల్) స్థాయి కమిటీ 81వ సమావేశంలో వన్యప్రాణుల అనుమతి ప్రతిపాదనపై చర్చించింది. 2025 ఏప్రిల్ నాటికి వన్యప్రాణుల అనుమతిని ఆశిస్తున్నట్లు మంత్రి బీసీజనార్థన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

రహదారి పనుల ఒప్పందాలు

రెండు ప్యాకేజీలకు సంబంధించిన ఒప్పందాలు 28-01-2025 న రాయితీ దారులతో సంతకం చేయడమయింది. ఈ ప్యాకేజీలను 2025 జూన్ చివరి నాటికి ప్రారంభించడమవుతుందని ఆశిస్తున్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం

గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలోని రహదారులు గుంతలమయంగా మారాయని మంత్రి వివరించారు. 2014 – 19 మధ్య టీడీపీ ప్రభుత్వం కాలంలో రోడ్ల పరిస్థితి దుర్దశగా ఉండేదని, పక్క రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం అసెంబ్లీలో ఈ విషయంపై జోకులు వేసుకునే పరిస్థితి ఉండేదన్నారు.

ప్రస్తుత ప్రభుత్వ ప్రయత్నాలు

గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దాదాపు 22 వేల కి.మీ రాష్ట్ర రహదారులకు సంబంధించి, 18 వేల కి.మీ రోడ్లను 3 నెలల స్వల్ప వ్యవధిలోనే 85 శాతం రోడ్లను గుంతల రహితంగా తీర్చిదిద్దిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు.

కడప – రేణిగుంట రోడ్డు పునరుద్ధరణ

కడప – రేణిగుంట రోడ్డు పూర్తి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. గుంతల రహిత రోడ్ల మరమ్మతులో భాగంగా రూ. 44 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేశామన్నారు.

అటవీ అనుమతుల కోసం ప్రయత్నాలు

అటవీ శాఖ అనుమతులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి, అనుమతులు క్లియరెన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి బీసీజనార్థన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. త్వరలోనే అన్ని అనుమతులు పూర్తి చేసి, రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయడం జరుగుతుందని మంత్రి సభ్యులకు తెలియజేశారు.

#BC Janardhan Reddy AndhraPradesh Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News TDP Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.