📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Janardhan Rao: నకిలీ మద్యం కేసులో జనార్దనరావు అరెస్ట్

Author Icon By Anusha
Updated: October 11, 2025 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో సంచలనం రేపిన నకిలీ మద్యం కేసుల్లో ఒక కీలక మలుపు తిరిగింది. అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ఈ నకిలీ మద్యం ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడిగా పేరున్న విజయవాడకు చెందిన జనార్దనరావు (Janardhan Rao) ను పోలీసులు అరెస్ట్ చేశారు. నెలల తరబడి కొనసాగిన విచారణ, ఇంటర్‌పోల్ సమాచారం, ఇమ్మిగ్రేషన్ అలర్ట్‌ల తర్వాత చివరికి ఆయనను పట్టుకున్నారు.

Cabinet Sub-Committee Meeting: రుషికొండ భవనంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

దక్షిణాఫ్రికా నుంచి జనార్దనరావు (Janardhan Rao) విజయవాడ వస్తున్నాడన్న సమాచారంతో గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు మాటువేశారు. ఆయన విమానం దిగి బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఛాయాచిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి.

ఆయనను పోలీసులు విచారణ నిమిత్తం రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.జనార్దనరావు (Janardhan Rao), అతని అనుచరుడు రాజు కలిసి ములకలచెరువు కనుగొండ ఆర్చి ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఇటీవల దాడులు నిర్వహించి రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

Janardhan Rao

నకిలీ మద్యాన్ని విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో

ఈ కేసులో ఇప్పటికే జనార్దనరావు సోదరుడు జగన్మోహనరావును పోలీసులు అరెస్టు చేశారు.ములకలచెరువు (Mulakalacheruvu) లో తయారుచేసిన నకిలీ మద్యాన్ని విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) లో ఏర్పాటుచేసిన బాట్లింగ్ యూనిట్‌లో ప్రాసెసింగ్ చేసినట్లు గుర్తించారు.

ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్ వద్ద నకిలీ మద్యం (Fake alcohol) తయారీ కేంద్రాన్ని కూడా ప్రారంభించి, విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.గోల్డ్ అడ్మిరల్, క్లాసిక్ బ్లూ, కేరళ మాల్ట్, మంజీరా తదితర మద్యం బ్రాండ్ల ఒరిజినల్ లేబుళ్లతో మద్యాన్ని వేల కొద్దీ క్వార్టర్ బాటిళ్లలో నింపినట్లు నిర్ధరించారు. మూతలు బిగించే యంత్రాలు, హోలోగ్రామ్ స్టిక్కర్లు, కార్టన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తన సోదరుడు జగన్మోహనరావు సాయంతో

ఇక్కడి నుంచి మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులకు నకిలీ మద్యం తరలించినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. తన సోదరుడు జగన్మోహనరావు (Jaganmohan Rao) సాయంతో జనార్దనరావు (Janardhana Rao) ఈ దందా నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఆఫ్రికా దేశాల్లో మద్యం తయారీలో ఆరితేరి అక్కడ వ్యాపారం నిర్వహిస్తున్న జనార్దనరావు గత నెల 24న దక్షిణాఫ్రికాకు వెళ్లారు.

ఈ నెల 5వ తేదీనే ఆయన తిరిగి రావాల్సి ఉండగా, ఇక్కడి మద్యం దందా వెలుగుచూడటంతో అక్కడే ఆగిపోయారు. ఈ దందాలో తన పేరు రావడంతో ఆయన అక్కడి నుంచే తనకు దీనితో ఎటువంటి సంబంధం లేదంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అయితే ఆయన పోలీసులకు లొంగిపోవడానికి రాగా, ముందస్తు సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News fake liquor case Janardhan Rao arrest latest news Telugu News Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.