ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ ముసురుకున్న లైంగిక వేధింపుల ఆరోపణలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నగరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మరియు ఇతర వైసీపీ నేతలతో కలిసి ఆమె భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళా ఉద్యోగినిని వేధింపులకు గురిచేసిన ఎమ్మెల్యేపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
Nandigam Suresh: దంపతుల నుంచి ప్రాణహాని ఉందంటూ వ్యక్తి ఆరోపణలు
ఈ సందర్భంగా రోజా జనసేన పార్టీపై అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. “జనసేన అంటే కామ సేన, కామాంధుల సేన” అని విమర్శిస్తూ, ఆ పార్టీ నాయకుల తీరుపై మండిపడ్డారు. అధికార బలంతో మహిళలను వేధించడం కూటమి ప్రభుత్వంలో పరిపాటిగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ముఖ్యంగా క్యారెక్టర్ లేని వ్యక్తులతో రాజకీయం చేస్తున్న హోంమంత్రిని తక్షణమే పదవి నుంచి సస్పెండ్ చేయాలని రోజా డిమాండ్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వం ఈ విషయంలో మౌనం వీడాలని, అధికార పార్టీ ఎమ్మెల్యే అన్న కారణంతో కేసును పక్కదారి పట్టించవద్దని వైసీపీ నేతలు హెచ్చరించారు. బాధితురాలు ముఖ్యమంత్రిని కలిసినా, ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని వారు ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని రోజా స్పష్టం చేశారు.
Read hindi news: http://hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com