Jaggayyapet Elections Results: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి వాసిరెడ్డి మేఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 540 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మేఘన ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కుమార్తె కావడంతో ఈ ఎన్నికల ఫలితం స్థానికంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మేఘన విజయం ఖరారు కావడంతో జనసేన, కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు ఆమెకు అభినందనలు తెలిపారు.
Read Also :Pedana Municipal Election Results:పెడనలో జనసేన ఘన విజయం
Jaggayyapet Elections Results: ఇదిలా ఉండగా, వాసిరెడ్డి పద్మ గతంలో వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట అసెంబ్లీ టికెట్ ఆశించినప్పటికీ ఆమెకు పార్టీ అవకాశం కల్పించలేదు. అప్పటి నుంచి వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పద్మ కుమార్తె మేఘన జనసేన తరఫున ఎన్నికల బరిలో నిలిచి కౌన్సిలర్‌గా విజయం సాధించడం జగ్గయ్యపేట రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :